బిహార్ ఎన్నికల ఫలితాలు- ఎన్డీఏ హవా- సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు

Published : November 14, 2025 at 7:23 AM IST
|Updated : November 14, 2025 at 6:10 PM IST
Bihar Election 2025 Result Live Updates : బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో విజేతలెవ్వరో మరికాసేపట్లో తేలనుంది. ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ కూటముల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెట్టారో ఈ ఫలితాలతో వెల్లడి కానుంది. ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ప్రతి ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద రెండంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రం లోపల కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుందని వివరించింది.
LIVE FEED
కూటముల వారీగా విజయాలు
- ఎన్డీఏ: గెలుపు 173, ఆధిక్యం 33
- మహాగఠ్‌బంధన్: గెలుపు 26, ఆధిక్యం 5
- ఇతరులు: గెలుపు 4, ఆధిక్యం 2
సంబరాలు చేసుకుంటున్న జేడీయూ నేతలు
ఎన్డీఏ చారిత్రాత్మక విజయం
పట్నాలో పార్టీ కార్యాలయం ముందు సంబరాలు చేసుకుంటున్న జేడీయూ కార్యకర్తలు
భోజ్‌పురీ సింగర్స్ మైథిలీ ఠాకూర్ విజయం
- తొలిసారి పోటీ చేసి విజయం సాధించిన జానపద గాయని మైథిలీ ఠాకూర్
- అలీనగర్ స్థానం నుంచి గెలుపు
మెజార్టీ మార్క్ దాటిన ఎన్డీఏ
మెజార్టీ మార్కు దాటిన ఎన్డీఏ- మరో ఇంకా 77 స్థానాల్లో ముందంజలో
ఇప్పటివరకు 126 స్థానాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి
బిహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ
బిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక న్యాయం గెలిచాయి. ఈ అద్భుతమైన తీర్పు ప్రజలకు సేవ చేయడానికి, బిహార్ కోసం కొత్త సంకల్పంతో పనిచేయడానికి తమకు మరింత శక్తినిస్తుంది. ఎన్డీఏ కార్యకర్తలు అవిశ్రాంతిగా పనిచేసి, అభివృద్ధి ఎజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లారు. అలాగే ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని తిప్పికొట్టారు. అందకు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. ఎన్డీఏ ఈ గెలుపు బిహార్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే దార్శనికతకు ఆదేశం లాంటిది' అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
100కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం
- ప్రస్తుతం 102 స్థానాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి
- మరో 101 స్థానాల్లో ముందంజలో
- ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ 12 స్థానాల్లో గెలుపు.. 22 స్థానాల్లో ముందంజలో
బిహార్‌లో ఎన్డీఏ చరిత్రాత్మక విజయం : జేపీ నడ్డా
బిహార్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. బిహార్‌లో ఎన్డీఏ చరిత్రాత్మక విజయం సాధిస్తుందని అన్నారు. ఈ గెలుపు మోదీ, నీతీశ్ ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ విధానాలపై నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. జంగల్‌రాజ్, అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. సుపరిపాలన, స్థిరత్వం, అభివృద్ధికి ఓటేశారని జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
ఎన్డీఏ గెలుపు- చిరాగ్ పాసవాన్ సంబరాలు
బిహార్ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ కూటమి
ఈ కూటమిలోని ఎల్‌జేపీ (రాంవిలాస్) సైతం ఇప్పటివరకు 4 స్థానాల్లో విజయం, 15 చోట్ల ముందంజలో
పట్నాలోని నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చిరాగ్ గెలుపు సంబరాలు
కూటముల వారీగా విజయాలు ఇలా
- ఎన్డీయే: గెలుపు 82, ఆధిక్యం 119
- మహాగఠ్‌బంధన్: గెలుపు 7, ఆధిక్యం 29
- ఇతరులు: గెలుపు 3, ఆధిక్యం 3
బిహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించి అమిత్ షా
వికసిత్ బిహార్‌పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమిది: అమిత్ షా
జంగల్‌రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ వేషంలో వచ్చినా వారికి దోచుకునే అవకాశం లభించదు : అమిత్ షా
బిహార్ అభివృద్ధికి సేవ చేయాలనే ఎన్డీఏ నిబద్ధతకు ప్రజల ఆమోద ముద్రే ఈ అద్భుతమైన తీర్పు : అమిత్ షా
బీజేపీ: గెలుపు 71, ఆధిక్యం 126
మహాగఠ్‌బంధన్: గెలుపు 4, ఆధిక్యం 34
ఇతరులు: గెలుపు 2, ఆధిక్యం 4
పార్టీల వారీగా విజయాలు
- బీజేపీ : గెలుపు 20, ఆధిక్యం 73
- జేడీయూ: గెలుపు 12, ఆధిక్యం 66
- ఎల్‌జేపీ (ఆర్‌వీ): ఆధిక్యం 19
- ఆర్జేడీ: గెలుపు 3, ఆధిక్యం 27
- కాంగ్రెస్: గెలుపు 1, ఆధిక్యం 4
వెనుకంజలోనే లాలూ కుమారులు
- రాఘోపుర్‌లో 4వేలకు పైగా ఓట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతోన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
- మహువాలో మూడో స్థానంలో ఉన్న జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్
కూటముల వారీగా విజయాలు
భాజపా: గెలుపు 13, ఆధిక్యం 187
మహాగఠ్‌బంధన్: గెలుపు 3, ఆధిక్యం 33
ఇతరులు: గెలుపు 1, ఆధిక్యం 6
- ఎట్టకేలకు ఖాతా తెరిచిన కాంగ్రెస్
- కిషన్‌గంజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖమ్రుల్ హొడా విజయం
ఉపముఖ్యమంత్రి సామ్రాట్ విజయం
- తారాపుర్‌లో ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరీ విజయం
- మోకామాలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ విజయం
- బోధ్ గయలో ఆర్జేడీ అభ్యర్థి కుమార్ సర్వజీత్ గెలుపు
బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం విజయం
- అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది.
- కొచ్చధామన్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం తరఫున పోటీ చేసిన ఎండీ శర్వార్ ఆలం గెలుపొందారు
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు
- దర్బంగా -సంజయ్ సరోగి
- కియోటి- డాక్టర్ మురారి మోహన్ ఝా
- సాహెబ్ గంజ్- రాజ్ కుమార్ సింగ్
- అలాగే గయ టౌన్ -ప్రేమ్ కుమార్
- నర్కిటియాగంజ్- సంజయ్ కుమార్ పాండే
జేడీయూ పోస్ట్ డిలీట్‌తో సీఎం పదవీపై గందరగోళం
- మళ్లీ నీతీశే సీఎం అంటూ ఈ ఉదయం పోస్ట్ చేసిన జేడీయూ
- తాజాగా ఆ పోస్ట్‌ను తమ ఎక్స్ ఖాతా నుంచి తొలగించిన పార్టీ
- దీంతో తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ
- బిహార్ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమికి భారీ ఎదురుదెబ్బ
- ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా వెనుకంజ
- 10 రౌండ్లు పూర్తయ్యేసరికి 3230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్న తేజస్వీ యాదవ్
- ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ ఆధిక్యం
బీజేపీ ఆఫీస్‌కు మోదీ
- ఎన్డీఏ జోరు- రాత్రి 7 గంటలకు బీజేపీ ఆఫీసుకు మోదీ
- కేంద్రమంత్రులు, ఇతర నేతలతో సమావేశం కానున్న ప్రధాని మోదీ
- అనంతరం బిహార్ ఫలితంపై మీడియాతో మాట్లాడే అవకాశం
పార్టీల వారీగా ఫలితాలు
- బీజేపీ - 90
- జేడీయూ - 78
- ఎల్‌జేపీ (ఆర్‌వీ) - 21
- ఆర్జేడీ - 33
- కాంగ్రెస్ - 3
- సీపీఐ (ఎంఎల్) - 4
రాఘోపుర్‌లో మళ్లీ వెనుకంజలో తేజస్వీ యాదవ్
ఏడో రౌండ్ ముగిసే సరికి 343 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్న ఆర్జేడీ నేత
ఈ స్థానంలో భాజపా అభ్యర్థి సతీశ్ కుమార్‌కు ఆధిక్యం
ఎన్డీయే డబుల్ సెంచరీ
- 200 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
- 38 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ముందంజ
- 5 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం
పార్టీల వారీగా ఆధిక్యాలు ఇలా
- బీజేపీ - 88
- జేడీయూ - 77
- ఎల్‌జేపీ (ఆర్‌వీ) - 21
- ఆర్జేడీ - 34
- కాంగ్రెస్ - 4
- రాఘోపుర్‌లో ఆధిక్యంలోకి వచ్చిన తేజస్వీ యాదవ్
- ఆరో రౌండ్ పూర్తయిన తర్వాత తేజస్వీకి స్వల్పంగా 219 ఓట్ల ఆధిక్యం
బిహార్ ఎన్నికలు ఎన్డీయే కూటమి 190+
- ప్రస్తుతం 192 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
- 46 స్థానాల్లో ముందంజలో ఉన్న మహాగఠ్‌బంధన్
- 5 చోట్ల ఇతరులకు ఆధిక్యం
- ఒక్క చోటా ఆధిక్యం దక్కించుకోని ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ
లాలూ కుమారులు డీలా
- రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) వెనుకంజ
- మహువాలో తేజ్ ప్రతాప్ యాదవ్ (జేజేడీ) వెనుకంజ
- అలీనగర్‌లో సింగర్ మైథిలీ ఠాకూర్ (బీజేపీ) ముందంజ
- తారాపుర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ (బీజేపీ) ముందంజ
- లఖిసరాయ్‌లో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ) ముందంజ
ఎన్డీయే జోరు- పట్నాలో సంబరాలు
పట్నాలో జేడీయూ నేతలు సంబరాలు
- జేడీయూ కార్యాలయం ఎదుట మిఠాయిలు పంచుకుంటున్న నేతలు
- నీతీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ ఆనందం వ్యక్తం చేస్తోన్న జేడీయూ నేతలు
పార్టీల వారీగా ఆధిక్యాలు ఇలా
- బీజేపీ - 81
- జేడీయూ - 75
- ఎల్‌జేపీ (ఆర్‌వీ) - 17
- ఆర్జేడీ - 39
- కాంగ్రెస్ - 9
భారీ మెజార్టీ దిశగా ఎన్డీయే
- 183 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
- 57 స్థానాలకు పరిమితమైన మహాగఠ్‌బంధన్
- 2 స్థానాల్లో ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ
రాఘోపూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందంజ
- మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1273 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆర్జేడీ నేత
- ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ ముందంజ
- అలీనగర్‌లో సింగర్ మైథిలీ ఠాకూర్ (బీజేపీ) వెనుకంజ
- మహువాలో లాలూ కుమారుడు తేజ్‌ప్రతాప్‌యాదవ్ (జేజేడీ) ముందంజ
- తారాపూర్‌లో ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ (బీజేపీ) ముందంజ
బిహార్ ఎన్నికలు- కీలక నేతల ఫలితాల సరళి ఇలా
- లఖిసరాయ్‌లో విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ) వెనుకంజ
- అలీనగర్‌లో మైథిలీ ఠాకూర్ (బీజేపీ) ముందంజ
- తారాపుర్‌లో సామ్రాట్ చౌధరీ (బీజేపీ) ముందంజ
- రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) ముందంజ
- మహువాలో తేజ్‌ప్రతాప్ యాదవ్ (జేజేడీ) వెనుకంజ
- మొకామాలో అనంత్ కుమార్ సింగ్ (జేడీయూ) ముందంజ
- గయా పట్టణంలో ప్రేమ్ కుమార్ (బీజేపీ) ముందంజ
- జముయ్‌లో శ్రేయాసి సింగ్ (బీజేపీ) ముందంజ
- 174 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు
- 66 స్థానాల్లో ముందంజలో ఉన్న మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు
- 3 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం
- ఈ ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ
- ఆధిక్యాల్లో దూసుకెళ్తోన్న ఎన్డీయే
- 165 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ముందంజ
- 73 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు
- 5 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం
- బిహార్ ఎన్నికలు అతిపెద్ద పార్టీగా జేడీయూ!
- 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సీఎం నీతీశ్ కుమార్ పార్టీ
- 64 స్థానాల్లో భాజపా అభ్యర్థుల ముందంజ
- 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఆర్జేడీ పార్టీ అభ్యర్థులు
- ప్రస్తుతం 154 స్థానాల్లో ముందంజలో ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు
- 84 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోన్న మహాగఠ్‌బంధన్ అభ్యర్థులు
- ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోన్న ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ
- బిహార్‌లో మళ్లీ చతికిలపడిన కాంగ్రెస్
- కేవలం 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ
- మహాగఠ్‌బంధన్ కూటమిలో ప్రధాన ఆర్జేడీ పార్టీకి 60 స్థానాల్లో ఆధిక్యం
- ఆధిక్యంలో ఖాతా తెరిచిన ప్రశాంత్ కిశోర్ పార్టీ
- ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోన్న జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థి
- ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
- బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి హవా
- ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు
- 71 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థుల ముందంజ
- మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాల ప్రకారం అధికార ఎన్డీఏ కూటమి 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాగఠ్‌బంధన్ కూటమి 54 స్థానాల్లో ముందంజలో ఉంది.
- రాఘోపూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందంజ
- అలీనగర్‌లో సింగర్ మైథిలీ ఠాకూర్ (బీజేపీ) వెనుకంజ
- మహువాలో లాలూ కుమారుడు తేజ్‌ప్రతాప్‌యాదవ్ (జేజేడీ) ముందంజ
- తారాపుర్‌లో ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ (బీజేపీ) ముందంజ
- మహువాలో తేజ్‌ప్రతాప్ యాదవ్ ముందంజ
- జనశక్తి జనతా దళ్ పేరుతో కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు
- ఆధిక్యాల్లో ఎన్డీఏ హాఫ్‌సెంచరీ
- 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న ఎన్డీఏ అభ్యర్థులు
- 23 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులకు ఆధిక్యం
ఆధిక్యాల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న ఎన్డీఏ కూటమి
- రాఘోపుర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజ
- అలీనగర్‌లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ వెనుకంజ
36 స్థానాల్లో ఎన్డీఏ, 12 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థుల ఆధిక్యం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార ఎన్డీఏనే ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థులు మైథిలీ ఠాకూర్, సామ్రాట్ చౌధరీ, నితీశ్ మిష్రా వంటివారు ఆధిక్యంలో ఉన్నారు. రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పార్టీల పరంగా చూస్తే బీజేపీ, ఆర్జేడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
- రెండు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
- ఓట్ల లెక్కింపు ప్రారంభం
- తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- నేడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఉదయం 8 నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- బిహార్: 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
- బిహార్‌లో మెుత్తం 243 స్థానాలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికలు
- ఈనెల 6, 11న రెండు విడతల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
- బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ఫిగర్ 122
- బిహార్‌లో అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ మధ్య పోటీ
- ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ(రామ్‌విలాస్)
- ఎన్డీఏ కూటమిలో హెచ్‌ఏఎం, రాష్ట్రీయ లోక్‌మోర్చా
- మహాగఠ్‌బంధన్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్, వీఐపీ
- మహాగఠ్‌బంధన్‌లో సీపీఐ, సీపీఎం, ఐఐపీ, జనశక్తి జనతాదళ్
- 238 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ
- బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 67.13 శాతం పోలింగ్
- బిహార్‌లో 1951 తర్వాత ఈసారే అత్యధిక పోలింగ్ నమోదు
- బిహార్‌లో 2020తో పోలిస్తే ఈసారి 9.84 శాతం అధికంగా పోలింగ్
- బిహార్ పీఠం మళ్లీ ఎన్డీయేదే అని మెజార్జీ ఎగ్జిపోల్స్ అంచనా
- బిహార్: కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రత, సీసీ కెమెరాలు నిఘా

