ETV Bharat / bharat

పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో 89.87 శాతం పోలింగ్‌ నమోదు

Assembly Elections 2026 Live Updates
Assembly Elections 2026 Live Updates (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 9, 2026 at 7:01 AM IST

|

Updated : April 9, 2026 at 9:23 PM IST

Choose ETV Bharat

Assembly Elections 2026 Live Updates : అసోం, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసోంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ జరుగుతోంది. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో ఎన్​డీఏ, డీఎంకే కూటముల మధ్య పోటీ నెలకొంది.

LIVE FEED

9:21 PM, 9 Apr 2026 (IST)

పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు

2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో 89.87 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. స్వాతంత్ర్యం అనంతరం 1964లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఈ మేరకు జరగడం ఇదే తొలిసారి అని ఓ అధికారి తెలిపారు. 1974లో పోలింగ్ శాతం 85.33గా, 2006లో 85.29గా, 2011లో 85.57గా నమోదైందని తెలిపారు.

6:11 PM, 9 Apr 2026 (IST)

ముగిసిన పోలింగ్

కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం, కేరళలో 75.01 శాతం పోలింగ్‌, అలాగే పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. అయితే, అసోంలో సాయంత్రం 5 గంటల వరకు రికార్డుస్థాయిలో పోలింగ్‌ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

4:14 PM, 9 Apr 2026 (IST)

కేరళ, అసోం, పుదుచ్ఛేరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల నాటికి భారీగా పోలింగ్ జరిగింది. అసోంలో ఇప్పటి వరకు 75.91 శాతం, కేరళలో 62.71 శాతం, పుదుచ్ఛేరిలో 72.40 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.

3:46 PM, 9 Apr 2026 (IST)

పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు రోబో స్వాగతం- ఎక్కడో తెలుసా?

పుదుచ్ఛేరిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద వినూత్నంగా ఒక రోబో ఓటర్లకు స్వాగతం పలుకుతోంది. ఓటు వేయడం మీ కర్తవ్యం. మీరు ఆ బాధ్యతను నెరవేర్చండి అంటూ చెబుతోంది.

3:40 PM, 9 Apr 2026 (IST)

కేరళ అసెంబ్లీ ఎన్నికలు- ఉత్సాహంగా పాల్గొంటున్న వయోవృద్ధులు

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో వయోవృద్ధులు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకుంటున్నారు. వారిని అనుసరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ సూచన

3:32 PM, 9 Apr 2026 (IST)

కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటులు వీరే!

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో మలయాళ సినీ అగ్రనటులు మోహన్​లాల్​, మమ్ముట్టి, పృథ్వీరాజ్​ సుకుమారన్​, నటుడు, కేంద్రమంత్రి అయిన సురేశ్ గోపి, టొవినో థామస్​, దిలీప్​ తదితరులు ఉన్నారు.

2:34 PM, 9 Apr 2026 (IST)

అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు- ఒంటి గంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి అసోంలో 59.63 శాతం మేర గణనీయమైన ఓటింగ్ నమోదైంది. అదే సమయంలో కేరళలో ఆ శాతం 49.70గా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే, అక్కడ 56.83 శాతం మేర చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ నమోదైనట్లు తేలింది.

1:44 PM, 9 Apr 2026 (IST)

  • అసోం, కేరళ, పుదుచ్చేరిలో కొనసాగుతున్న పోలింగ్‌
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు అసోంలో 59.63 శాతం పోలింగ్‌ నమోదు
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేరళలో 49.70 శాతం పోలింగ్‌ నమోదు
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పుదుచ్చేరిలో 56.83 శాతం పోలింగ్‌ నమోదు

1:04 PM, 9 Apr 2026 (IST)

తిరువనంతపురంలోని తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్లకు అంతర్జాతీయ ప్రతినిధులు స్వీట్లు పంచారు.

12:45 PM, 9 Apr 2026 (IST)

మాలీవుడ్ యాక్టర్ మమ్ముట్టి, ఆయన సతీమణి సుల్ఫత్ కుట్టి కొచ్చిలోని ఒక పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

12:19 PM, 9 Apr 2026 (IST)

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడూతూ, రాష్ట్రంలో బీజేపీ ఫ్యాక్టర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇక్కడ బీజేపీ పెద్ద ఫ్యాక్టర్ ఏం కాదు. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని 'సున్నా సీట్ల పార్టీ'గా బీజేపీ ఉన్న రాష్ట్రం ఇది. వారిని మిగతా పార్టీలతో సమానంగా ప్రస్తావించడమే వారికి మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం అవుతుంది. ఇది అధికారంలో ఉన్న LDF ప్రభుత్వానికి, దానికి సవాలు విసురుతున్న UDF కూటమికి మధ్య జరుగుతున్న పోరు" అని తెలిపారు.

11:55 AM, 9 Apr 2026 (IST)

అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు అసోంలో 38.92 శాతం పోలింగ్‌ నమోదు కాగా, కేరళలో 33.28 శాతం మంది ఓటేశారు. పుదుచ్చేరిలో 37.06 శాతం పోలింగ్‌ నమోదైంది.

11:44 AM, 9 Apr 2026 (IST)

అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాంత ఈ విధంగా నమోదయ్యాయి.

అసోం- 38.92 శాతం

కేరళ - 33.28 శాతం

పుదుచ్చేరి- 37.06 శాతం

10:59 AM, 9 Apr 2026 (IST)

కేరళలో యూడీఎఫ్ గెలుస్తుంది : కేసీ వేణుగోపాల్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 100పై స్థానాల్లో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సీఎం పినరయి విజయన్​పై ప్రజలు విసుగుచెందారని, మార్పును కోరుకుంటున్నారని అన్నారు. శబరిమల బంగారు దొంగతనం కేసులో దోషులను ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం రక్షిస్తోందని కూడా ఆయన ఆరోపించారు .

9:42 AM, 9 Apr 2026 (IST)

ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

మూడు అసెంబ్లీల ఎన్నికల్లో ఉదయం 9 గంటల నాటికి సుమారుగా నమోదైన పోలింగ్ శాతం ఇలా!

అసోం- 17.87%

కేరళ - 16.23%

పుదుచ్చేరి - 17.41%

9:40 AM, 9 Apr 2026 (IST)

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ తిరువనంతపురంలోని ఎంచక్కల్ ఎల్‌పీ స్కూల్‌లో ఓటు వేశారు.

8:44 AM, 9 Apr 2026 (IST)

ఓటర్ల తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ప్రజల మాట వినే, హామీలను నెరవేర్చే ప్రభుత్వాన్నికి పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లు ప్రగతి కోసం ఓటు వేయాలని చెప్పారు. ఈ మేరకు మూడు వేర్వేరు ట్వీట్లు పెట్టారు.

8:25 AM, 9 Apr 2026 (IST)

కేరళ ప్రతిపక్ష నాయకుడు (LoP) వీడీ సతీశన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ( యూడీఎఫ్ ) నిర్ణయాత్మక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

8:21 AM, 9 Apr 2026 (IST)

ఓటు వేసిన కేరళ సీఎం

కన్నూరులోని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

7:47 AM, 9 Apr 2026 (IST)

ఓటర్లకు రోబో స్వాగతం

పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను వస్తున్నారు. అయితే ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు రోబో స్వాగతం పలుకుతుంది.

7:24 AM, 9 Apr 2026 (IST)

ఓటింగ్​లో రికార్డ్ సృష్టించాలి : ప్రధాని మోదీ

కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటింగ్​లో కొత్త రికార్డును నెలకొల్పాలని తెలిపారు. ప్రజస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రత్యేకంగా యువతకు, మహిళా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మూడు వేర్వేరు ట్వీట్​లు చేశారు.

6:58 AM, 9 Apr 2026 (IST)

పోలింగ్ ప్రారంభం

అసోం, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

6:45 AM, 9 Apr 2026 (IST)

కేంద్రాల్లో మాక్​ పోలింగ్

కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పోలింగ్​ కేంద్రాల్లో అధికారులు మాక్​ పోలింగ్​ను నిర్వహించారు.

6:44 AM, 9 Apr 2026 (IST)

పుదుచ్చేరిలో ఇండియా కూటమి Vs ఎన్​డీఏ

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. 294మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 9,48,977 మంది ఓటర్లు ఉండగా, అందులో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు, 140 మంది ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. అయితే, ప్రధానంగా ఎన్​డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది.

6:43 AM, 9 Apr 2026 (IST)

కేరళలో త్రిముఖ పోరు

కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 140అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.71కోట్ల మంది ఓటర్లు ఉండగా 30, 495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అటు దాదాపు 2.42 లక్షల మందికి పైగా విదేశీ ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎల్​డీఎఫ్, యూడీఎఫ్, ఎన్​డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది.

6:43 AM, 9 Apr 2026 (IST)

అసోంలో కాంగ్రెస్ VS ఎన్​డీఏ

అసోంలోని 126అసెంబ్లీ స్థానాలు ఉండగా, 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 722మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.9కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 59 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.25 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 6.42 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు.

Last Updated : April 9, 2026 at 9:23 PM IST