హిజాబ్, బుర్ఖాలను ధరిస్తే గోల్డ్ షాపుల్లోకి నో ఎంట్రీ- ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ కొత్త రూల్
దొంగతనాలను అరికట్టడానికే ఈ కొత్త రూల్- తనిఖీ జరిగాకే షాప్‌లోకి అనుమతి - ఈ నియమం మహిళలతోపాటు పురుషులకు వర్తింపు

Published : January 7, 2026 at 6:31 PM IST
Hijabs Banned In Jewelry Store: బిహార్‌లో జ్వువెలరీ షాపుల్లో దొంగతనాలకు చెక్ పెట్టడానికి ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ ఓ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. బిహార్‌లో ఏ మహిళ అయిన హిజాబ్ లేదా బుర్ఖాను ధరించి గోల్డ్ కొనడానికి వస్తే వాళ్లని షాప్‌లోకి అనుమతించకూడదనే నియమాన్ని తీసుకొచ్చింది.
పురుషులకు సైతం వర్తిస్తుంది: ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ ఆదేశాల ప్రకారం మహిళలతో పాటు పురుషులకు సైతం ఈ నియమం వర్తిస్తుందని తెలిపారు. ఏ పురుషుడైన వారి ముఖాన్ని స్కార్ఫ్ లేదా హెల్మేట్తో కవర్ చేసుకుని వస్తే వారిని కూడా దుకాణం లోపలికి అనుమతించకూడదని తెలిపారు. వారి ముఖాన్ని తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొనడానికి అనుమతినివ్వాలని కోరారు.
బుర్ఖాలను ధరించి నేరాలు: అయితే ఇలాంటి కొత్త రూల్‌ను మొట్టమొదటి సారిగా బిహార్‌లోనే అమలు చేశారు. బంగారం దుకాణాల్లో తరచూ జరుగుతున్న చోరిలా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడైన ఆశోక్ కుమార్ వర్మ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో దొంగలు బుర్ఖాను ధరించి జ్యూవెలరీ షాప్స్‌లో నేరాలు చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో దుకాణదారులను కూడా కాల్చుతున్నారని అందుకే ఈ నిబంధలను తీసుకొచ్చామని ఆశోక్ కుమార్ వర్మ వెల్లడించారు.
ముఖాలను చూపించాకే ఎంట్రీ: ఈ నిర్ణయంతో మొత్తం బుర్ఖాలనే బ్యాన్ చేయలనేది తన ఉద్దేశం కాదన్నారు. దానికి బదులుగా ఎవరైతే హిజాబ్ గాని బుర్ఖాను ధరించి గోల్డ్ షాప్‌కు వస్తే వారి ముఖాలను తప్పక చూపించాలని అంతే కాక ఈ నిర్ణయాన్ని ప్రజలంతా సమ్మతించి వారికి సహాకరించాలని కోరారు. భద్రతా దృష్ట్యా ఈ నియమాన్ని తీసుకుని వచ్చమన్నారు. ఇది మహిళలతో పాటుగా పురుషులకు కూడా వర్తిస్తుందని ఆశోక్ కుమార్ వర్మ అన్నారు.
ముస్లిం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ బుర్ఖాకు నేను వ్యతిరేకం కానని, ఇలా చేయడంతో కస్టమర్ అలాగే షాప్కీపర్ మధ్య మంచి సంబంధాలు ఏర్పాడతాయని అన్నారు. ఈ రూల్ ప్రత్యేకంగా ఒక్క కమ్యూనిటీకే కాకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపారు. "నేను పాట్నా సెంట్రల్ ఎస్పీతో మాట్లాడాను. ఆయన ఈ నిర్ణయానికి సరే అన్నారు. ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడంలో బిహార్ మొదటి రాష్ట్రంగా నిలిచింది. అయితే ఈ రూల్ అనేక రాష్ట్రాల్లోని జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా అమలులో ఉంది". అని ఆశోక్ కుమార్ వెల్లడించారు.
ఎలాంటి వివాదానికి తావు లేదు: అయితే ఈ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నందున ఆశోక్ వర్మ ఈ విషయంపై మాట్లాడారు. " ఈ విషయంలో వ్యతిరేకత అంటూ ఏమి లేదు. మా సిబ్బందిలోని మహిళలు, పురుషులు కూడా హిజాబ్‌ను తీస్తారు. అలా చేయమని మేము వారిని అభ్యర్థిస్తామన్నారు. కేవలం భద్రతా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని దీంట్లో ఎలాంటి వివాదానికి తావు లేదని ఆశోక్ వర్మ తెలిపారు.
ఆ ఘటన జరిగిన తర్వాత: డిసెంబర్ 15న పాట్నాలో బిహార్ ముఖ్యమంత్రి నీతిశ్ కుమార్ ఆయుష్ డాక్టర్లకు లెటర్లను అందిస్తున్న సమయంలో హిజబ్ ధరించి ఉన్న ఓ ముస్లిం మహిళ మొహంపై హిజాబ్‌ను తొలగించాడు. ఇది రాష్ట్రంలో వివాదంగా చేలరేగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ మారింది. సోషల్ మీడియాలో ఈ విషయంపై దేశామంతటా చర్చలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత రాష్ట్రంలో ఈ రూల్‌ని తీసుకుని వచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోనూ సేమ్ రూల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిప్రి బజార్ ప్రాంతంలో కూడా బంగారు షాపుల్లో తరచూ దొంగతనాల బెడద పెరుగుతున్నందున అక్కడి దుకాణదారులు ఇదే తరహా నియమాన్ని తీసుకొచ్చారు. ముఖాన్ని కవర్ చేసుకున్న వారిని షాప్‌లోకి అనుమతించమని దీనికి సంబంధించిన బోర్డ్లను వారి షాప్ లోపల పెట్టుకున్నారు.
చోరీకి వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగ
రూ.4 నగదు, కర్చీఫ్ దొంగతనం కేసు- 51ఏళ్లుగా పరారీలో నిందితుడు- నిర్దోషిగా కోర్టు తీర్పు

