బిహార్ ఎన్నికలు- 44 మంది అభ్యర్థులతో JDU రెండో జాబితా విడుదల
తొలి జాబితాలో 57 మందికి చోటు కల్పించిన జేడీయూ- తాజా లిస్టులో మరో 44 మంది పేర్లు వెల్లడి

Published : October 16, 2025 at 12:50 PM IST
Bihar Polls JDU Candidates List : బిహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA) ఇప్పటికీ సీట్ల పంపకాల ప్రతిష్టంభనతో సతమతమవుతున్న వేళ జేడీయూ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన తొలి జాబితాలో 57 మందికి చోటు కల్పించిన జేడీయూ తాజా లిస్టులో మరో 44 మంది పేర్లను ప్రకటించింది.
తొలి జాబితాలో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్‌జన్ శక్తి కోరుకున్న ఐదు స్థానాల్లో అభ్యర్థులను జేడీయూ ఖరారు చేసింది. తుది జాబితాలోనూ ఆ పార్టీ కావాలనుకున్న మరో నాలుగు నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఖరారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 243 నియోజకవర్గాలున్న బిహార్‌లో ఎన్డీఏ తమకు కేటాయించిన మొత్తం 101 సీట్లకు సీఎం నీతీశ్ కుమార్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 37 మంది ఓబీసీ, 22 మంది ఈబీసీ, జనరల్ కేటగిరీ నుంచి 22 మంది, 15 మంది ఎస్సీ, ఒక ఎస్టీ, నలుగురు ముస్లీం అభ్యర్థులకు తమ జాబితాల్లో చోటు కల్పించింది.
నలుగురు ముస్లిం అభ్యర్థులు
జేడీయూ పోటీ చేస్తున్న 101 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో నలుగురు ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. అంతేకాకుండా, బిహార్ ఎన్నికల రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న కుల సమీకరణంపై దృష్టి సారించారు. మారథాన్ సమావేశాలు, బహుళ సమీక్షల తర్వాత పార్టీ నీతీశ్ పార్టీ తమ అభ్యర్థులను పేర్లను ప్రకటించడం ప్రారంభించింది.
ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నారు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ మిత్రపక్షాలలో, మాంఝీ తన ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. చిరాగ్ పాశ్వాన్ 17 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. తన వాటాలో మిగిలిన 12 సీట్లకు ఎల్జేపీ అభ్యర్థులను ఆయన ఇంకా వెల్లడించలేదు. కుష్వాహా నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, ఇద్దరు మిగిలి ఉన్నారు.
243 స్థానాలున్న బిహార్‌లో బీజేపీ 101, జేడీయూ 101, లోక్‌జన్‌శక్తి 29 స్థానాల్లో పోటీ చేస్తున్నయి. చెరో ఆరు స్థానాలను RLM, HAMలకు కేటాయించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీ(యూ) తన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి 57 స్థానాలను ప్రకటించింది. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసుకున్న సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీ(యూ) 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించగా, ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
తేజస్వీ యాదవ్ నామినేషన్- డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కూడా!
NDA vs NDA: బిహార్ ఎన్డీఏలో లుకలుకలు- LJP ఆశిస్తున్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జేడీయూ, HAM

