ETV Bharat / bharat

చిన్నతనంలో చూపుకోల్పోయిన 'ఆమె'- కానీ వందల మంది మహిళలకు ఉపాధి- ప్రేమలత స్టోరీ ఇదే!

10 నెలల వయసులోనే దివ్యాగురాలైన మహిళ- వందల మంది ఆడవాళ్లకు టైరింగ్​ శిక్షణ - ఫీజు చెల్లించలేని వారికి ఉచిత శిక్షణ

Odisha Woman Tailor Story
Odisha Woman Tailor Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 12:26 PM IST

|

Updated : March 1, 2026 at 12:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Woman Tailor Inspirational Story : ఆమె 10 నెలల వయసులో ఉన్నపుడే ఓ అగ్ని ప్రమాదం కారణంగా దివ్యాంగురాలు అయింది. ఆ తర్వాత కూడా తన జీవితంలో ప్రతి అడుగు ఒక పోరాటంలా సాగింది. వచ్చే అడ్డంకులు అన్నీ తొలగించుకుంటూ, తన బలహీనతను బలంగా మార్చుకుంటూ వచ్చింది. ఓ వైపు చదువుకుంటూ, మరో వైపు కుట్టు మిషన్​ నేర్చుకుంది. అలా తను జీవించడమే కాకుండా వందల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించింది.

10 నెలల వయస్సులో చూపు కోల్పోయి!
ప్రేమలత అనే 68 ఏళ్ల మహిళ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో నువాగాన్‌బాద్ గ్రామంలో నివసిస్తోంది. ఆమె 10 నెలల వయసులో ఉన్నపుడు ఓ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదంలో తన శరీరంలోని మూడు భాగాలు కాలిపోయాయి. దాంతో తన చూపును కూడా కోల్పోయింది. అలా కొంత కాలానికి తన తండ్రిని కల్పోయింది. ఆమెకు ఐదుగురు అన్నలు, సోదరిలు ఉన్నారు. దాంతో ప్రేమలతను ఆమె తల్లి తన మామయ్య ఇంటికి పంపింది. ఆమె చదువు అక్కడే పూర్తి చేసింది.

Odisha Woman Tailor Story
శిక్షణ పొందుతున్న మహిళలతో ప్రేమలత (ETV Bharat)

ఉద్యోగం చేస్తూ చదువు పూర్తిచేసి
జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, తన మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది. అదే సమయంలో కుట్లు,అల్లికలు నేర్చుకుంది. నేడు అదే తన జీవన ఆధారంగా మారింది. అనంతరం ఆమె 1980లో హిందీ పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అయ్యింది. తర్వాత ఒక వాచ్​ కంపెనీలో పని చేస్తూ ఉన్నత చదువులకు సిద్ధం అయ్యింది. కానీ 2000లో ఆ కంపెనీ మూతపడడంతో ఆమె ఖైరాకు తిరిగి వచ్చేసింది.

బంధువుల సాయంతో కట్టుమిషన్​ ప్రారంభం
1980లో ఒక కుట్టు మిషిన్​ను కొని, దానినే జీవనాధారంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు తన మామయ్య కుమారుల సాయంతో ఒక చిన్న షెడ్​, ఇల్లు నిర్మించుకుంది. 2006లో ఒక మిషన్​తో ప్రారంభించి, ఇతరులకు కూడా శిక్షణ ఇచ్చే స్థాయికి చేరింది. కొన్ని నెలల్లోనే తన ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు తన వద్ద శిక్షణ తీసుకోవడానికి వెళ్లడం ప్రారంభించారు.

700 మంది మహిళలకు శిక్షణ
అలా ప్రేమలత వందల మంది మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు సాయపడింది. గత 20 సంవత్సరాల్లో ప్రేమలత 700 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే అక్కడకు శిక్షణ కోసం వచ్చిన వారిలో 90 శాతం మంది ఆర్థికంగా బలహీనమైన వారే. ప్రేమలత టైలరింగ్‌తో పాటు ప్రసిద్ధ పిపిలి చందువా నుంచి ప్రేరణ పొందిన సాంప్రదాయ అప్లిక్ వర్క్ కానోపీలను కూడా తయారు చేస్తుంది. తర్వాత స్థానిక సంతలో వాటిని విక్రయిస్తుంది.

Odisha Woman Tailor Story
తాను కట్టిన వస్త్రాలు చూపిస్తున్న ప్రేమలత (ETV Bharat)

"నా కలలు నెరవేరకపోయినా, 700 మంది మహిళలకు రెక్కలు ఇచ్చాను. ఈ ఆడవాళ్లు తమ కాళ్లపై నిలబడితే అదే చాలు నాకు. నేను ప్రాణాలతో ఉన్నంత కాలం మహిళలకు శిక్షణ ఇస్తాను. నా వద్దకు శిక్షణకు వచ్చిన వారు ఎంత ఫీజు చెల్లించగలిగితే అంత తీసుకుని, ఇవ్వలేని వారికి ఉచితంగా శిక్షణ ఇస్తాను"
- ప్రేమలత

వయసు పెరగడంతో వేగం తగ్గింది!
ఆమె శిక్షణ ఇచ్చిన అనేక మంది మహిళల్లో తిలోత్తమ బెహరా ఒకరు. ప్రేమలత దగ్గర శిక్షణ పొందిన తర్వాత తాను సొంతంగా సంపాదిస్తున్నానని ఆమె అన్నారు. ఇప్పుడు తన ఇంటి ఖర్చులు తనే స్వయంగా చూసుకుంటున్నారని తెలిపారు. వయస్సు పెరగడంతో ప్రేమలత వేగం కాస్త తగ్గి ఉండచ్చు, కానీ ఆమె చాలా మందికి ఆదర్శంగా ఉంటారని తన వద్ద శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు అన్నారు. బాల్యం నుంచి తన జీవితంలో ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఎంతో మంది మహిళలకు తోడుగా నిలిచింది ఆమె.

గాలిలోని తేమ నుంచి నీటి ఉత్పత్తి - రోజుకు 50లీటర్ల నీరు అందించే 'ఏరో వాటర్​'

స్కూల్​కు డుమ్మా కొడితే మ్యూజిక్కే మ్యూజిక్​- విద్యార్థుల ఇళ్లకు మేళతాళాలతో టీచర్

Last Updated : March 1, 2026 at 12:42 PM IST