ETV Bharat / bharat

అరుదైన పక్షి జాతుల సంరక్షణ కోసం బర్డ్‌ పార్క్‌- 300 రకాల పండ్ల మొక్కలు సిద్ధం!

మనుషుల కోసం కాదు, పక్షుల కోసం ప్రత్యేక పార్క్‌!

Special Park For Birds
Special Park For Birds (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 14, 2025 at 8:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Special Park For Birds : దేశవ్యాప్తంగా పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరుగాంచిన మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​లో విభిన్న ప్రయత్నం మొదలైంది. మనుషుల కోసం కాదు, పక్షుల కోసం ప్రత్యేక పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది నగర పాలక సంస్థ. నగరంలోని సత్యదేవ్‌నగర్‌లో సుమారు ఒక బిగా విస్తీర్ణంలో బర్డ్ పార్క్ రూపుదిద్దుకుంటోంది.

పక్షుల కోసం 300 ఫలవృక్షాలు!
శహరీకరణ కారణంగా పక్షుల గూళ్లు, నివాసాలు నశిస్తున్నాయి. వాటిని కాపాడే ప్రయత్నంగా స్థానిక కార్పొరేటర్ అభిషేక్ శర్మ బబ్లు, సత్యదేవ్‌నగర్ నివాసులు కలసి పార్క్‌ను ప్రారంభించారు. ప్రజల సహకారంతో 300 ఫలదాయకమైన మొక్కలు నాటారు. ఇందులో మామిడి, జామ, అంజీర, కాజూ, బేర, శతూత్, క్రాబ్ ఆపిల్, విదేశీ చింతపండు వంటి వృక్షాలు ఉన్నాయి.

మానవ ప్రవేశానికి నో ఎంట్రీ
ఈ పార్క్ ప్రత్యేకత ఏమిటంటే – ఇందులో మానవులకు ప్రవేశం ఉండదు. పక్షులు మాత్రమే స్వేచ్ఛగా సంచరించగలుగుతాయి. పార్క్ చుట్టూ కంచె వేసి, పక్షుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానికుడు ధర్మేష్ పండిట్ మాట్లాడుతూ, పార్క్‌లోని మొక్కలకు నీరు పోసే పని, సంరక్షణ మొత్తం తామే చూస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం తనకు కేటాయించిన మొక్కను పెంచుతోందని చెప్పారు.

స్మారక చిహ్నాల్లా మొక్కలు
పార్క్‌లో నాటిన ప్రతి మొక్క ఒక స్మృతిచిహ్నంలా నిలుస్తోంది. తమ మరణించిన బంధువుల జ్ఞాపకార్థం స్థానికులు తమకు నచ్చిన మొక్కలను నాటారు. ప్రతి మొక్కపై ఆ బంధువు పేరు ఉన్న బోర్డు ఉంచారు. దాంతో మొక్కలపై వారికి అనుబంధం ఏర్పడింది. ఫలితంగా మొక్కలు వేగంగా పెరుగుతున్నాయని కార్పొరేటర్ అభిషేక్ శర్మ తెలిపారు.

పక్షుల కోసం నీటి కుంట
పక్షుల ఆహార, నీటి అవసరాల దృష్ట్యా పార్క్‌లో చిన్న కుంట నిర్మించారు. ఇందులో చిన్న చేపలను వదిలారు. దీంతో కింగ్‌ఫిషర్, బగులు వంటి నీటి పక్షులు ఆకర్షితమవుతున్నాయి. ప్రతి రకమైన పక్షికి ఇష్టమైన వృక్షాలను నాటడం కూడా ప్రత్యేకత.

186 పక్షుల జాతులు!
పక్షి నిపుణుడు అజయ్ గడీకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 186 పక్షుల జాతులు సంకటస్థితిలో ఉన్నాయి. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన 47 జాతులు ఉన్నాయి. వాటిలో ఖరమోర్, సోన్ చిడియా వంటి పక్షులు ఇప్పటికే కనుమరుగవుతున్నాయన్నారు అజయ్ గడీకర్. గుడ్లగూబలు, గ్రద్ధల సంఖ్య కూడా తగ్గుతోందన్నారు.

కొత్త ప్రయత్నంగా మారిన పార్క్
ఆయన చెప్పినట్టుగా, గౌరయ్యలు, బుల్బుల్లు, తీతలు కూడా తగిన ఆశ్రయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిని రక్షించాలంటే వేట్ల్యాండ్లు, చిన్న పక్షి పార్కులు, ప్రజల సహకారం అవసరమని సూచించారు. ఇందౌర్ బర్డ్ పార్క్ ఆ దిశగా ముందడుగు వేస్తోంది. పచ్చదనం, పక్షుల గానంతో నగరం తిరిగి మేల్కొనడానికి ఇది ఓ కొత్త ప్రయత్నంగా మారింది.