ETV Bharat / bharat

జమ్ములో తొలి స్వదేశీ ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్- వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ- ఖర్చు కూడా తక్కువే!

భారత్​ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎమర్జెన్సీ పవర్ రిస్టోరేషన్ సిస్టమ్- తొలిసారిగా జమ్ముకశ్మీర్​లోనే- ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

Indigenous Emergency Power Restoration System
Indigenous Emergency Power Restoration System (CSIR)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 9:59 PM IST

4 Min Read
Choose ETV Bharat

Indigenous Emergency Power Restoration System : విపత్తుల నిర్వహణ మౌలిక వసతుల రంగంలో భారత్ ఒక చారిత్రక ముందడుగు వేసింది. స్వదేశీంగా అభివృద్ధి చేసిన 'ఎమర్జెన్సీ రిట్రీవల్ సిస్టమ్​' లేదా 'ఎమర్జెన్సీ పవర్ రిస్టోరేషన్ సిస్టమ్'​ను జమ్ముకశ్మీర్​లో విజయంవంతంగా ఏర్పాటు చేసింది. దీనిని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్​ఐఆర్-ఎస్​ఈఆర్​సీ) అభివృద్ధి చేసింది. పూర్తిగా భారత్​లోనే డిజైన్ చేసి పేటెంట్ పొందిన ఈ సిస్టమ్​ను అమర్చడం ఇదే తొలిసారి.

వరదలు, తుపానులు, కొండచరియలు విరిగిపడటం లేదా భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో హై-వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ టవర్లు కూలిపోవడం, దెబ్బతినడం జరగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఈ ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్, తాత్కాలికంగా విద్యుత్‌ను అత్యంత వేగంగా పునరుద్ధరించే సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భారత్​ ఇప్పటి వరకు అమెరికా, కెనడా నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చేది.

తొలిసారిగా జమ్ముకశ్మీర్​లోనే!
2025 ఆగస్టులో తొలిసారిగా ఈ స్వదేశీ వ్యవస్థను ఫీల్డ్​లో అమర్చారు. జమ్ములోని తారాడ్- ఉధంపుర్ ప్రాంతంలోని కిశన్​పుర్- పంపోర్ ట్రాన్స్​మిషన్ లైన్​లోని హై-వోల్టేజ్ టవర్ ప్రకృతి విపత్తుతో దెబ్బతినడంతో ఈ వ్యవస్థను ఉపయోగించారు. దీనిని గుజరాత్‌కు చెందిన అడ్వైట్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ లిమిటెడ్ అమలు చేసింది. సీఎస్​ఐఆర్​ టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవస్థను తయారు చేసే లైసెన్స్ ఈ సంస్థకు ఉంది. ఇక హైటెక్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (కోల్​కతా), ఐఏసీ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో రెండు సంస్థలు కూడా ఈ టెక్నాలజీ తయారీకి లైసెన్స్ పొందాయి.

రూ.60 కోట్లకు పైగా ఆదా!
సీఎస్​ఐఆర్​-ఎస్​ఈఆర్​సీ ప్రకారం, ఈ స్వదేశీ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా విద్యుత్ సంస్థకు రూ.60 కోట్లకు పైగా ఆదా అయింది. అంతేకాక, సాధారణంగా పట్టే సమయంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. స్వదేశీంగా ఈ వ్వవస్థను తయారు చేయడానికి సుమారు రూ. 18 కోట్లు అయ్యింది.

ఈ వ్యవస్థ ఎందుకు కీలకం?
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. అయితే దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం వల్ల ఇళ్లు ఆసుపత్రులు పరిశ్రమలు అత్యవసర సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. హై-వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ టవర్లు సాధారణంగా 33 కేవీ నుంచి 800 కేవీ వరకు విద్యుత్‌ను మోసుకెళ్తాయి. ఒక టవర్ పూర్తిగా మరమ్మతు చేయాలంటే లేదా తిరిగి నిర్మించాలంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. కానీ కొత్త ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ సరఫరా పునురుద్ధిచగలదు. అలాగే మరమ్మతులు పూర్తయ్యే వరకూ తాత్కాలిక వంతెనలా పనిచేస్తుంది.

స్వదేశీ సాంకేతికత- అంతర్జాతీయ ప్రమాణాలు
పూర్తిగా భారత్​లోనే ఈ వ్యవస్థను రూపొందించి, పరీక్షించి, పేటెంట్​ను పొందిందని సీఎస్​ఐఆర్​-ఎస్​ఈఆర్​సీ డైరెక్టర్ అనందవల్లి ఈటీవీ భారత్​కు తెలిపారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారత్ ఇప్పుడు అమెరికా కెనడా తర్వాత మూడో దేశంగా నిలిచిందని తెలిపారు. భారత్​లో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ సాంకేతికంగా విదేశీ వ్యవస్థలతో సమానమైన సాంకేతిక సామర్థ్యం, తక్కువ బరువు, ఖర్చుతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. భారతీయ భౌగోళిక పరిస్థితులకు అనువైన ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు ఈ సిస్టమ్ మరింత అనుకూలంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఖర్చు, లాజిస్టిక్స్‌లో భారీ లాభం!
'విదేశాల నుంచి ఇలాంటి వ్యవస్థను దిగుమతి చేసుకోవడం వల్ల విద్యుత్ సంస్థలకు దాదాపు రూ.45 కోట్లు ఖర్చవుతుంది. ఇది స్వదేశీంగా కంటే దాదాపు 60 శాతం ఎక్కువ. దిగుమతి చేస్తే కస్టమ్స్ క్లియరెన్స్ లాజిస్టిక్ ఆలస్యాలు విపత్తు సమయంలో సమస్యలు ఎదురవుతాయి. భారతీయ వ్యవస్థలోని కీలక ఆవిష్కరణ 'గింబల్ పాయింట్' జాయింట్ ఇది లోడ్-బేరింగ్ కనెక్టర్. విదేశీ వ్యవస్థల్లో దాదాపు 200 కిలోల బరువున్న భాగాలు ఉపయోగించారు. కానీ స్వదేశీ వ్యవస్థ కేవలం 30 కిలోలు బరువు ఉంటుంది. దీంతో పర్వత ప్రాంతాల్లో రవాణా ఎంతో సులభమవుతుంది' అని ఆనందవల్లి వివరించారు.

భారత టెక్నాలజీపై అంతర్జాతీయ ఆసక్తి
అమెరికా, కెనడాల్లో తాత్కాలిక మద్దతు నిర్మాణ కోసం సీఎస్​ఐఆర్-ఎస్​ఈఆర్​సీ పేటెంట్ దాఖలు చేసినట్లు ఆనందవల్లి తెలిపారు. ప్రత్యేక టూ-పిన్ గింబల్ జాయింట్‌కు భారత్‌లో ఇప్పటికే పేటెంట్ పొందిందని అన్నారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను తయారు చేయడానికి విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయని ప్రైవేటు కంపెనీలు తెలిపారు.

దిగుమతి నుంచి ఎగుమతిదారుగా భారత్
జమ్ముకశ్మీర్‌లో ఈ వ్యవస్థ విజయవంతంగా అమర్చడం భారత్ సాంకేతిక స్వావలంబనను హైలైట్ చేస్తుంది. అలాగే భవిష్యత్తులో వాతావరణ మార్పులతో వచ్చే విపత్తులకు సంసిద్ధతను కూడా మరింత బలపరుస్తోంది. ఇక అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ టెక్నాలజీలో దిగుమతులపై ఆధారపడిన దేశం నుంచి ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుకుంది. ఇది స్వదేశీ ఇంజినీరింగ్ సామర్థ్యానికి విపత్తు నిర్వహణలో భారత బలానికి ప్రత్యక్ష నిదర్శనం.

ఉద్యోగం​ వదిలి వ్యాపారంలోకి- ఏటా రూ.70 లక్షలు సంపాదిస్తున్న 'సమోసా కింగ్'​!

ఐఐటీల ఎదుట పెనుసవాల్- మిగిలిపోతున్న 30 శాతం ఎంటెక్, పీహెచ్‌డీ‌ సీట్లు- కోర్సుల్లో మార్పులకు కసరత్తు