అమెరికా, భారత్ సంబంధాల బలోపేతం- యూఎస్ రక్షణ అధికారులతో చర్చలు జరిపిన మిస్రీ
పెంటగాన్‌లో అమెరికా రక్షణ అధికారులతో మిస్రీ సమావేశం- రక్షణ పరిశ్రమ, టెక్నాలజీ, సరఫరా గొలుసులపై చర్చలు- వాణిజ్య శాఖ అధికారులతో కీలక భేటీలు


Published : April 9, 2026 at 8:52 AM IST
India US Ties : భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అమెరికా పర్యటనలో భాగంగా కీలక దౌత్య చర్చలు జరిపారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లో అమెరికా రక్షణ, వాణిజ్య శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రక్షణ పరిశ్రమ, ఆధునిక సాంకేతికత, సరఫరా గొలుసుల అనుసంధానంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
డిఫెన్స్ పార్టనర్‌షిప్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా!
పెంటగాన్‌లో అమెరికా రక్షణ శాఖకు చెందిన అండర్ సెక్రటరీ మైఖేల్ డఫీతో విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గత ఏడాది కుదిరిన మేజర్ డిఫెన్స్ పార్టనర్‌షిప్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా రక్షణ రంగంలో సహకారాన్ని పెంచేందుకు మార్గాలను అన్వేషించారు.
Foreign Secretary Shri Vikram Misri had a fruitful interaction with the Under Secretary of War for Acquisition & Sustainment Mike Duffey @USDASDuffey at the Pentagon. The two principals discussed ways to further deepen the defence industrial, technology and supply chain linkages… pic.twitter.com/RIU4Qc9ZT6
— India in USA (@IndianEmbassyUS) April 8, 2026
వాణిజ్య సంబంధాల విస్తరణపై ప్రధానంగా చర్చ
భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగింది. రక్షణ ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, సరఫరా గొలుసుల బలోపేతంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. భవిష్యత్తులో రక్షణ రంగంలో సంయుక్త ప్రాజెక్టులు, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చర్చించారు. ఇదే పర్యటనలో భాగంగా విక్రమ్ మిస్రీ అమెరికా వాణిజ్య శాఖకు చెందిన అండర్ సెక్రటరీలు జెఫ్రీ కెస్లర్, విలియం కిమ్మిట్‌లతో కూడా సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా కీలక సాంకేతిక రంగాలు, వాణిజ్య సహకారం, మరియు విశ్వసనీయ సరఫరా గొలుసుల నిర్మాణంపై ఇరుదేశాలు దృష్టి పెట్టాయి.
Foreign Secretary Shri Vikram Misri met Under Secretaries Jeffrey Kessler @BISgov and William Kimmitt @TradeGov to expand cooperation in commercial and critical technologies - key to transforming the 🇮🇳-🇺🇸 partnership for the 21st century. They also discussed building resilient… pic.twitter.com/Tvvlzrbru4
— India in USA (@IndianEmbassyUS) April 8, 2026
21వ శతాబ్దానికి అనుగుణంగా భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఆధునిక తయారీ, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారం పెంచాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, విశ్వసనీయ మరియు స్థిరమైన సరఫరా గొలుసులు ఎంత ముఖ్యమో ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. విక్రమ్ మిస్రీ పర్యటనలో గ్లోబల్ అంశాలు కూడా ప్రాధాన్యం పొందాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ భద్రతా పరిస్థితులపై ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఈ అంశాల్లో సమన్వయం పెంచుకోవాలని కూడా నిర్ణయించారు.
Sustaining the momentum of 🇮🇳-🇺🇸 defence exchanges, Foreign Secretary Shri Vikram Misri had another wide ranging conversation with Under Secretary of War for Policy Elbridge Colby @USWPColby at the Pentagon, covering the ongoing developments in the Indo-Pacific region and West… pic.twitter.com/V0zxrVcadg
— India in USA (@IndianEmbassyUS) April 8, 2026
పరస్పర నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యమా?
ఇటీవలి కాలంలో భారత్- అమెరికా సంబంధాలు కొంత ఒడిదుడుకులకు గురైన విషయం తెలిసిందే. అమెరికా విధించిన సుంకాలు, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ మిస్రీ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను మళ్లీ స్థిరీకరించడం, పరస్పర నమ్మకాన్ని పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది.
Launch of 🇮🇳-🇺🇸 Trade Portal!
— India in USA (@IndianEmbassyUS) April 8, 2026
Foreign Secretary Shri Vikram Misri along with Ambassador Shri Vinay Kwatra @AmbVMKwatra launched the India-USA Trade Facilitation Portal to help power us to Mission 500!
We thank @CimGOI @PiyushGoyal Hon’ble Minister of Commerce and Industry of… pic.twitter.com/xD1CDZ8ufF
మరోవైపు, ఇటీవల అమెరికా రక్షణ విధాన బృందానికి చెందిన ఎల్బ్రిడ్జ్ కోల్బీ భారత్‌ను సందర్శించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో కూడా రక్షణ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి. ఇప్పుడు మిస్రీ పర్యటనతో ఆ చర్చలకు మరింత కొనసాగింపు లభించినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, భారత్- అమెరికా సంబంధాలు రక్షణ, వాణిజ్య రంగాల్లో కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయి. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సహకారం మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు తాజా చర్చలు సూచిస్తున్నాయి.
ట్రంప్, మోదీ స్నేహంతో భారత్ - అమెరికా బంధం బలోపేతం : సెర్జియో గోర్

