ETV Bharat / bharat

'అందువల్లే హిమాలయాలు వేగంగా క్షీణిస్తున్నాయి'- అధ్యయనంలో కీలక విషయాలు

ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్​ జియోలజీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Research on Himalayas
Research on Himalayas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 7:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Research on Himalayas : హిమాలయ పర్వతాల భవిష్యత్తుపై కీలక విషయాలు వెల్లడించారు పరిశోధకులు. ఉత్తరాఖండ్​లోని గరుడ గంగ, ధౌలీ గంగ ప్రాంతాల్లో ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్​ జియోలజీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఎగువ హిమాలయాల కంటే తేమతో కూడిన ప్రాంతాల్లోని పర్వతాలు క్షీణించే ప్రమాదం సుమారు నాలుగు రెట్లు అధికమని చెప్పారు శాస్త్రవేత్తలు. ఇంకా రెండు రెట్లు అధికంగా నదుల్లోకి రసాయనాలను విడుదల అవుతాయని వివరించారు. ఇది సహజమైన కార్భన్ డై ఆక్సైడ్​, నదుల్లోని ఖనిజాలపైనా నేరుగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

హిమాలయ పర్వతాల్లోని కొండలు వేగంగా క్షీణిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే, ఇందుకు కేవలం భౌగోళిక పరిస్థితులు, ఉష్ణోగ్రతలు మాత్రమే కారణం కాదన్నారు. వాతావరణ పరిస్థితులతో పాటు సూక్ష్మజీవుల కార్యకలాపాలు కూడా ప్రభావం చూపిస్తాయని వివరించారు. భూమిపై వాతావరణ పరిస్థితులపై ప్రభావం పడడమే కాకుండా జీవవ్యవస్థలో పోషకాలను నియంత్రిస్తుందని అభిప్రాయపడ్డారు. వెచ్చటి, తేమతో కూడిన ప్రాంతాల్లో నీరు, ఉష్ణోగ్రత, జీవ ప్రతిచర్యల వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతందని అన్నారు. ఇంకా టెక్టోనిక్​ కార్యాకలాపాల వల్ల కొండలు బలహీనపడడమే కాకుండా రసాయన చర్యల వల్ల కొత్త భూఉపరితలం ఆవిర్భవిస్తుందని చెప్పారు. హిమాలయ పర్వతాల్లో ప్రాచీన వాతావరణ పరిస్థితులను రక్షించడమే ప్రధాన సవాలని పరిశోధకులు అన్నారు. ఇందుకు వేగంగా మారుతున్న భౌగోళిక పరిస్థితులే కారణమని వెల్లడించారు. హిమాలయాల్లోని గర్వాల్​ ప్రాంతాల్లో కొంత మేరకు ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Research on Himalayas
హిమాలయాలపై అధ్యయనం (ETV Bharat)

"ఈ అధ్యయనంలో మందాకిని లోయ సమీపంలోని లవాడీ గ్రామంలో ఒక అరుదైన భూమిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పర్వతాల విస్ఫోటనం, వందేళ్ల క్రితం ఏర్పడిన ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రాచీన రామ్​గఢ్​ రాళ్ల పరిధిలోకి వస్తాయి. పూర్తిగా పోర్పిరీ గ్రానైట్​తో ఉన్న ఈ ప్రాంతం సుమారు 1750 మిలియన్​ ఏళ్ల నాటిది. గర్హాల్​, లాన్స్​డౌన్​, మలారీ ప్రాంతాల్లోని పర్వతాలు క్రమంగా విస్ఫోటనం చెందుతున్నాయి. మారుతున్న వాతావరణ, జీవవైవిధ్య పరిస్థితులే ఇందుకు కారణం. లాన్స్​డౌన్​ ప్రాతం నుంచి సేకరించిన శాంపిళ్లలో ఇక్కడి రాళ్లు సుమారు 1,46,000 ఏళ్ల నాటివిగా గుర్తించాం. అదే మలారీ ప్రాంతంలో సేకరించిన రాళ్లు 60,000 ఏళ్ల నాటివి. 50-60 మిల్లీమీటర్ల రాళ్లు వేలాది ఏళ్లకు ఒకసారి ఇలా మార్పులకు గురవుతాయి."

--ప్రదీప్ శ్రీవాస్తవ, ఐఐటీ రూర్కూ శాస్త్రవేత్త

ఉత్తరాఖండ్‌ చమోలి జిల్లాలోని మలారి పర్వతాల్లో ఒక ప్రత్యేకమైన రాతి పొరను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పొర మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ల్యూకోగ్రానైట్ శిల అని గుర్తించారు. ఈ ప్రాంతం హిమాలయాల ఎగువ పొరల్లో భాగమని, దీనిని హయ్యర్ హిమాలయన్ స్ఫటికం అని పిలుస్తారని చెప్పారు. ఈ శిలలు సుమారు 17 నుంచి 24 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని వెల్లడించారు. ఇందులో టూర్మాలిన్, ముస్కోవైట్ వంటి అరుదైన ఖనిజాలను కలిగి ఉంటాయన్నారు.

Research on Himalayas
హిమాలయాలపై అధ్యయనం (ETV Bharat)
Research on Himalayas
హిమాలయాలపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు (ETV Bharat)

1.8 మీటర్ల లోతు వరకు మట్టి ఖనిజ కూర్పు గణనీయమైన మార్పులను చూపించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే 2 మీటర్ల దిగువన ఉన్న పొరల్లో మాత్రం పెద్దగా మారలేదని కనిపెట్టారు. ఇక పై పొరల్లో కాల్షియం, సోడియం, పొటాషియం వంటి మూలకాల పరిమాణాలు తగ్గాయని, ఇనుము, టైటానియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పెరిగాయని వివరించారు.

Research on Himalayas
హిమాలయాలు (ETV Bharat)

గర్హాల్​ హిమాలయాలు చాలా అరుదైనవని శాస్త్రవేత్త ప్రదీప్​ శ్రీవాస్తవ అన్నారు. ఇవి తరచూగా అనేక మార్పులు చెందుతాయని చెప్పారు. వర్షాలు, హిమపాతం, భూకంపాల ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భూమి కోతకు గురవుతుందని తెలిపారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రతీ వెయ్యేళ్లకొకసారి 5,000 మిల్లీమీటర్ల భూమి కొట్టుకుపోతుందని అన్నారు. ఇంకా తేలికపాటి వాలులు ఉన్న ప్రాంతాల్లో కేవలం 60-80 మిల్లీమీటర్లు భూమి మాత్రమే పోతుందని చెప్పారు.