ETV Bharat / bharat

భారత్​- పాక్ మధ్య శాంతిని కోరుకోవడం రాజద్రోహం కాదు : హైకోర్టు

రాజద్రోహం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ యువకుడికి హిమాచల్​ ప్రదేశ్​ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Himachal Pradesh HC on Sedition Case
Himachal Pradesh HC on Sedition Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 12:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

Himachal Pradesh HC on Sedition Case : రాజద్రోహం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ యువకుడికి హిమాచల్​ ప్రదేశ్​ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భారత్​- పాకిస్థాన్​ యుద్ధ సమయంలో పాక్​ జాతీయుడితో మాట్లాడుతూ అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో అతడిపై రాజద్రోహం కేసు నమోదైంది. రెండు దేశాల మధ్య శాంతిని కోరుకోవడం రాజద్రోహం కిందకు రాదని తీర్పు సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.

"భారత్​- పాక్​ యుద్ధంపై విమర్శలు చేస్తూ ఒకరితో మాట్లాడుతున్న ఫొటోలు, వీడియోలతో కూడిన పెన్​ డ్రైవ్​ను ప్రాథమిక సాక్యాలుగా అందించారు. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరూ కలిసి ఉండాలని, యుద్ధాలతో ఎలాంటి ఉపయోగం లేదని వారు అన్నారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాలను అంతం చేసి, శాంతిని పునరుద్ధరించాలనే కోరిక దేశద్రోహం ఎలా అవుతుందో అర్థం చేసుకోవడం కష్టం. అతడి పోస్ట్ అశాంతి వాతావరణాన్ని సృష్టించలేదు. అందువల్ల వాటిని దేశద్రోహంగా పరిగణించలేము."

--జస్టిస్ రాకేష్ కైంత్లా

పాస్​పోర్ట్​ అప్పగించడం సహా ఐదు షరతులతో బెయిల్ మంజూరు
రాజద్రోహంగా పరిగణించని హైకోర్టు, షరతులతో కూడి బెయిల్‌ మంజూరు చేసింది. పాస్​పోర్ట్​ అప్పగించడం సహా ఐదు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా సాక్ష్యులను, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే ట్రయల్ కోర్టు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని క్రమంలో బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసేందుకు స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

'మతం కన్నా మానవత్వం గొప్పది'
అభిషేక్ సింగ్ భరద్వాజ్​ అనే యువకుడు భారత్- పాక్ యుద్ధ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. యుద్ధాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. మతం కన్నా మానవత్వం గొప్పదని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్​ జెండాలు, ఆయుధాలతో కూడిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతడి వ్యాఖ్యలపై దెహ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ప్రస్తుతం ధర్మశాల జైలులో శిక్ష అతను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేయగా, అతడికి ఉపశమనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా సమాతంరంగా దీనిపై విచారణ
2024 జూన్​లో పాకిస్థాన్​ జెండాలతో పాటు ఏకే 47 లాంటి ఆయుధాలతో కూడిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ యువకుడు​. దీనిపై 2025 మే 28న భారతీయ న్యాయ సంహిత సెక్షన్​ 152 ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసు సున్నితత్వం నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా సమాతంరంగా దీనిపై విచారణ చేపట్టాయి. కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో సమాంతర దర్యాప్తును నిర్వహించాయి. విచారణ అనంతరం పోలీసులు అతడిపై దేశద్రోహం, గూఢచర్యం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని విచారించారు. కాంగ్రా జిల్లాలోని దేహ్రా పరిధికి చెందిన అభిషేక్​ భరద్వాజ్, కళాశాల చదువు మధ్యలోనే మానేసిన విద్యార్థిగా గుర్తించారు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన అతడి తండ్రి డ్రైవర్‌గా పని చేస్తుండగా, తల్లి స్థానిక హోటల్‌లో క్లీనర్‌గా పనిచేస్తోంది.

దేశంలో జనగణనకు రంగం సిద్ధం- ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ ప్రారంభం- కేంద్ర హోంశాఖ వెల్లడి

'అది ఐపీఎల్ మ్యాచ్ కాదు- జల్లికట్టు- ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్­' : మద్రాస్ హైకోర్టు