కెరీర్ అవకాశాలు కోల్పోతున్న జెన్‌జీ- లింక్డిన్ నివేదికలో వెల్లడి
విమర్శలకు గురవుతామనే భయంతో - ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న జెన్‌జీ నిపుణులు- లింక్డిన్ నివేదిక వెల్లడి

Published : September 2, 2026 at 8:48 PM IST
LinkedIn Report On Gen Z: విమర్శలకు గురవుతామనే భయంలో, జెన్‌జీ నిపుణులు కెరీర్ అవకాశాలు కోల్పోతున్నారని లింక్డ్ఇన్ నివేదిక తాజాగా వెల్లడించింది. జెడ్జ్ చేస్తారేమోననే భయంతో, తమ కెరీర్ ఎదుగుదలకు సహాయపడే వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి లేదా పరిచయాలు పెంచుకోవడానికి చాలా మంది జెన్‌జీ నిపుణులు వెనకడుగు వేస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన జెన్‌జీ నిపుణులు నిరంతరం ఆన్లైన్ ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. కానీ వారి కెరీర్‌కు ఉపయోగపడే వ్యక్తులతో మాట్లాడడానికి, లేదా నెట్వర్కింగ్ చేయడానికి 83 శాతం మంది వెనకాడుతున్నారని లింక్డిన్ నివేదిక స్పష్టం చేసింది.
లింక్డ్ఇన్ రిపోర్టు ప్రకారం, "ఇతరులు తమను తప్పుగా అంచనా వేస్తారనే భయం 44 శాతం మందిలో ఉండగా, ఇతరులను ఇబ్బందిపెడుతున్నామనే ఆందోళనలో 39 శాతం ఉన్నారు. తాము నిజాయితీగా మాట్లాడడం లేదని ఇతరులు అనుకుంటారోమోనని 37 శాతం మంది అనుకుంటున్నారు. అందువల్ల జెన్‌జీ యువతీయువకులు విలువైన సలహాలు పొందలేకపోతున్నారు. కొత్త పరిచయాలు చేసుకోలేక, మంచి అవకాశాలు అందుకోలేకపోతున్నారు."
లింక్డ్ఇన్ కోసం సెన్సెస్వైడ్ అనే సంస్థ ఈ 2026 జులై 20 నుంచి ఆగస్టు 11 మధ్య ఒక సర్వే నిర్వహించింది. భారత్, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ సర్వే చేపట్టింది. ఈ దేశాల్లో ఫుల్ టైమ్, పార్ట్ టెమ్ పని చేసే 18 నుంచి 80 ఏళ్ల వయస్సు గల 18,050 మంది స్పందనలను తీసుకుని నివేదిక రూపొందించింది.
ఎలా రిలేషన్ ఏర్పరుచుకోవాలో తెలియక!
ఈ నివేదిక ప్రకారం, 79 శాతం మంది భారత జెన్ జీ యువతకు వృత్తిపరమైన సంబంధాలు చాలా ముఖ్యమని తెలుసు. అయినప్పటికీ సగం మందికి పైగా (52 శాతం) వాటిని ఎలా ప్రారంభించాలో తెలియక సతమతం అవుతున్నారు. అలాగే 53 శాతం మంది తమ పరిచయాలను నిజమైన సంబంధాలుగా మార్చుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. పైగా అందుకు అయ్యే ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారు.
వారికే ఛాన్స్‌లు ఎక్కువ!
లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో కంపెనీలో అంతర్గత పరిచయాలు ఉన్న వ్యక్తులకు, అలాంటి పరిచయాలు లేని వారితో పోలిస్తే దాదాపు 8.5 రెట్లు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అయితే వృత్తిపరమైన సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో, తమకు ఎవరూ స్పష్టంగా చెప్పడంలేదని ప్రతి ఐదుగురిలో ముగ్గురు (59 శాతం) జెన్‌జీ యువత చెబుతున్నారు. చాలా మంది ఈ విషయంతో తమకు పెద్దగా మార్గదర్శకత్వం లభించడంలేదని, తమంతట తామే నేర్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. దీని వల్ల ఎవరిని, ఎప్పుడు, ఎలా సంప్రదించాలి? ఏం మాట్లాడాలి? అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోందని యువత అభిప్రాయపడుతున్నారు.
జెన్ ఎక్స్- వెరీ హెల్పింగ్ నేచర్!
జెన్ జీ యువత ఇతరులను సంప్రదించడానికి సంకోచిస్తున్నప్పటికీ, మెజారిటీ మిలీనియల్స్ (92 శాతం), జెన్ ఎక్స్ నిపుణులు (95 శాతం) తమకు తెలియని వారైనా సరే, కెరీర్ ప్రారంభంలో ఉన్నవారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. "ఇప్పుడు ఉద్యోగాలు మారుతున్నాయి. కెరీర్ మార్గాలు కూడా ఒకేలా సరళంగా ఉండడం లేదు. ఇలాంటి సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, సమాజంలో ఇతరులతో మంచి పరిచయాలు పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే నెట్వర్కింగ్ పెంచుకోవడం అనగానే ఎవరో తెలియని వారితో పరిచయాలు పెంచుకోవడం, లేదా ఇబ్బందిగా మాట్లాడడం కాదు. చిన్న చిన్న మాటలే కాలక్రమేణా మీపై నమ్మకాన్ని పెంచుతాయి. మీ పరిచయాలను పెద్దవి చేస్తాయి. మీకు బాగా అవసరం అయినప్పుడు అవే మంచి అవకాశాలను, సలహాలను, సహాయాన్ని అందజేస్తాయి" అని లింక్డ్ఇన్ తన నివేదికలో పేర్కొంది.
గృహిణి టు చెస్ ఆర్బిటర్- కొడుకు కోసం చదరంగం నేర్చుకున్న తల్లి
ఆయుర్వేదంలోనూ AI- వీఆర్, సిమ్యులేటర్లతో మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు- సంప్రదాయ గ్రంథాలు డిజిటలైజ్

