వైకల్యంపై పోరాడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కవలలు- సరిగ్గా చదవడం, రాయడం రాకున్నా!
డిస్లెక్సియాను జయించి మరీ విజయం సాధించిన కవలలు

Published : December 4, 2025 at 3:37 PM IST
Twins Secured Government Job : ఆ ఇద్దరూ ఎక్కడికెళ్లినా అందరి చూపూ వాళ్లపైనే! కనీసం ఒక్కసారైనా ఆగి వాళ్లిద్దరినీ చూసే వాళ్లు. కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యేవారు అనుకోండి. ఇంకా ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి పుట్టారు, కలిసి ఆడుకున్నారు, కలిసి పెరిగారు. చివరికి ఒకే రోజున కలిసి ప్రభుత్వ సేవలో ప్రవేశించి అందరినీ ఆకట్టుకున్నారు. అందులో ప్రత్యేకత ఏముంది? ఈ మధ్య చాలామంది చాలా రంగాల్లో సాధిస్తున్నారు కదాని అనుకుంటున్నారా! అవును ప్రత్యేకత ఉంది. వాళ్లిద్దరూ కేవలం కవలలే కాకుండా చిన్నప్పటినుంచి డిస్లెక్సియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతూనే వారి లక్ష్యాన్ని ఛేధించారు. మరి వాళ్ల వివరాలేంటో తెలుసుకుందామా?
వైకల్యం నుంచి విజయం వరకు
తమిళనాడు కూరైకుండులోని భీమనాడి గ్రామానికి చెందిన జోసెఫ్ (రిటైర్డ్ KSEB సీనియర్ సూపరింటెండెంట్), సుని జార్జ్ (కల్లంచిర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు) ముగ్గురు కుమార్తెలు. అందులో సవితా, సంగీత అనే ఇద్దరు కవలలు. పైగా వీరిద్దరూ డిస్లెక్సియా అనే లెర్నింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఫలితంగా చదవడం, రాయడం, అక్షరాలను అర్థం చేసుకోవడంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కవలల తల్లిదండ్రులు వారికి మద్దతుగా నిలిచారు. అక్క కవిత జోసెఫ్ కూడా తన చెళ్లెల్లకు నిరంతరం మద్దతు ఇచ్చి తోడుగా ఉన్నారు.

గురువు బిపిన్ మార్గదర్శకత్వంలో
సవితా, సంగీత తమ పాఠశాల విద్యను కల్లంచిర ALP స్కూల్, ప్లాచిక్కర AUP స్కూల్, వరక్కాడ్ వల్లియోడన్ కేలు నాయర్ స్మారక హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేశారు. ముఖ్యంగా, వారు PSC పరీక్షలతో సహా అన్ని పరీక్షలను స్క్రైబ్ సహాయం లేకుండానే రాశారు. ఇంటర్ తర్వాత, వారిద్దరూ యానిమేషన్ పూర్తి చేశారు. అటు తల్లిదండ్రుల మద్దతుతో పాటు గురువు బిపిన్ మార్గదర్శకత్వం వారిని బలవంతులను చేసింది. వారి పరిమితులను గుర్తించి, వారికి పాఠాలను బోధించి విజయానికి బాటలు వేశారు. వందకు పైగా ప్రాక్టీస్ పరీక్షలు రాయించి వారిని సిద్ధం చేశారు. వారు మొదట్లో ఇబ్బంది పడిన గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంలో వారికి సహాయం చేశారు. భీమనాడిలోని PSC కోచింగ్ సెంటర్ క్యాటలిస్ట్‌లో దాదాపు మూడు సంవత్సరాలు అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రారంభంలో వారు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, వారు తిరిగి దారిలోకి వచ్చి సమిష్టిగా తమ లక్ష్యాన్ని సాధించారు. చివరకు ఒకేరోజు హోస్దుర్గ్ మున్సిపల్ కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
"ఇద్దరు కూమార్తెలు వైకల్యాన్ని జయించి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా గర్వంగా ఉంది. మా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం రావాలనేది మా ఏకైక కోరిక. కానీ వారు సాధించింది అమూల్యమైనది. మా కుమార్తెలు ఈ విజయం సాధించడం మొత్తం మా కుటుంబానికే గర్వకారణం. వీరి విజయ గాథ, సంకల్ప శక్తితో పరిమితులను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ గొప్ప ప్రేరణ."
సవితా, సంగీత, తల్లిదండ్రులు
23 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం
ఇద్దరూ 23 సంవత్సరాల వయస్సులోనే కష్టాలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. సవితను హోస్దుర్గ్ సబ్ కోర్టులో అలాగే సంగీతను హోస్దుర్గ్ మున్సిపల్ కోర్టులో నియమించారు. యాదృచ్ఛికంగా, రెండు కోర్టులు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. ఇంకా వారి నియామక ఉత్తర్వులు సైతం నవంబర్ 30న వారి చేతికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులతో కలిసి విధుల్లో చేరారు. "మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ స్థానానికి చేరుకోవడానికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని సవిత, సంగీత వారి ఆనందాన్ని పంచుకున్నారు." అని సవితా, సంగీత ఆనందం వ్యక్తం చేశారు.
100 సీసీ బైక్‌పై సోదరుల సాహస యాత్ర- గ్వాలియర్ నుంచి హిమాలయాల వరకు- డెడ్ చీప్‌గా టూర్స్!
భారత్‌లో కవలలకు జన్మనిచ్చిన పాక్ మహిళ- మళ్లీ తమ దేశానికి వెళ్లేందుకు నో- ఇక్కడే బాగుందంట

