ETV Bharat / bharat

24 గంటల్లో 600 మిల్లీమీటర్ల వర్షం- వరదలతో దెబ్బతిన్న నిర్మాణాలు, వాహనాలు- పలు చోట్ల స్కూళ్లకు సెలవులు!

దేశంలో పలుచోట్ల దంచికొడుతున్న వర్షాలు- పుణెలో పలు చోట్ల విరిగిపడిన మట్టిపెళ్లలు- జమ్మూకశ్మీర్​లో బురదలో కూరుకుపోయిన అనేక వాహనాలు- సహాయకచర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం

Jammu Kashmir Floods
Jammu Kashmir Floods (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 7, 2026 at 11:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Jammu Kashmir Floods : దేశంలో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ముంబయి, జమ్మూకశ్మీర్​లో భారీ వర్షాల దాటికి రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్​ సమస్య ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో నాసిక్​లో హై అలర్ట్​ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. త్రయంబకేశ్వర్ ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అలాగే, హిమాచల్​ ప్రదేశ్​లోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికి జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించింది.

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం థత్రి పట్టణ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. గతరెండ్రోజుల్లో ఆకస్మిక వరదలు రావడం ఇది మూడోసారని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు థత్రి పట్టణంలోకి బండరాళ్లు, బురద, శిథిలాలు కొట్టుకువచ్చాయన్నారు. దీంతో పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోగా, మరికొన్ని వాహనాలు ఆకస్మిక వరదలో కొట్టుకుపోయి చినాబ్ నదిలోకి చేరాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రభావితమైన వాహనాల సంఖ్య, మొత్తం నష్టం ఎంత అనేది ఇంకా అధికారికంగా అంచనా వేయాల్సి ఉంది. మరోవైపు, ఆకస్మిక వరదల కారణంగా థత్రి వద్ద దోడా-కిష్త్వార్ జాతీయ రహదారి మూసుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఇక, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా పుణెలోని ప్రధాన హిల్‌స్టేషన్‌ లోనావాలోలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో అక్కడ 670 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కారణంగా కర్జాత్‌-లోనావాలా ఘాట్‌ సెక్షన్లలో కొండ చరియలు విరిగిపడినట్లు తెలిపారు. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.

పర్యాటక ప్రదేశాల్లోకి వెళ్లడంపై నిషేధం
గత 48 గంటల్లో పుణెజిల్లా వ్యాప్తంగా ఏకంగా 22 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. భోర్ ఘాట్‌లోని ఠాకూర్వాడి సమీపంలో తొలుత కొండచరియలు విరిగిపడటంతో మూడు లైన్లపై ప్రభావం పడిందని చెప్పారు. తర్వాత మంకీ హిల్, ఖండాలా మధ్య మరోచోట కూడా ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మహారాష్ట్రలోని థానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కోటలు, జలాశయాలతో సహా అన్ని పర్యాటక ప్రదేశాల్లోకి ప్రవేశాన్ని నిషేధించింది.

ముంబయి, గోవా రహదారిపై రవాణా పునఃప్రారంభం
ఇదిలా ఉండగా, సోమవారం ముంబయి, గోవా రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన భద్రతా చర్యలు పూర్తి చేయడంతో మంగళవారం వాహనాలు రవాణా పునఃప్రారంభమైంది. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని, ట్రాఫిక్​ సూచనలను పాటించాలని కోరారు. ఇదిలా ఉండగా, రైల్వే ట్రాక్‌లపై బండరాళ్లు పడగా, భారీ కొండచరియలు విరిగిపడటంతో ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే, పాత ముంబయి-పుణె హైవేపై కూడా ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

7 ఏళ్ల బాలుడి అవయవదానం- ఆరుగురి జీవితాల్లో వెలుగులు

అయోధ్య విరాళాల కేసు: షూస్‌, దుస్తుల్లో నోట్ల కట్టలు దాచి చోరీ- సిట్ విచారణలో సంచలన నిజాలు