హల్ద్వానీ 'శుద్ధీకరణ' వివాదం- రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై కాంగ్రెస్ ఫైర్- 'శుద్ధీకరణ' నిర్వహించిన వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపాటు

Published : August 31, 2026 at 10:05 AM IST
FIR Registered Against Rahul: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వాల్మీకి కమ్యూనిటీకి చెందిన సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న కార్యక్రమ వేదికను శుద్ధి చేసిన విషయంలో రాజకీయ వివాదం చెలరేగింది. ఇదే అంశంపై ఆగస్టు 29న దిల్లీల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
ఆగస్టు 11న హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో జరిగిన "ఆచారం, పరిశుభ్రత కార్యక్రమం"లో నేను స్వయంగా పాల్గొన్నాను. ఆ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కులానికి, ఈ ఆచారానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ, విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వాల్మీకి సామాజిక వర్గ భావాలను తీవ్రంగా గాయపరిచాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారిని అస్పృశ్యత పాటించేవారిగా దళిత వ్యతిరేకులుగా రాహుల్ చిత్రీకరించారు."
-వాల్మీకి కమ్యునిటీ సభ్యుడు, ఫిర్యాదు దారు
అసలేం జరిగింది?
ఆగస్టు 8న హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం, ఆగస్టు 11న కొందరు వ్యక్తులు అక్కడి సభావేదికను శుద్ధిచేశారన్న ఆరోపణలతో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ విషయంపై ఆగస్టు 29న దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్గే బహిరంగసభ వేదికను శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी की जनसभा के बाद ‘शुद्धिकरण’ करने वालों पर कार्रवाई नहीं, लेकिन उस जातिवादी कृत्य के खिलाफ आवाज उठाने वाले नेता प्रतिपक्ष श्री राहुल गांधी जी पर FIR। यही भाजपा सरकार का न्याय है?
— Kumari Selja (@Kumari_Selja) August 31, 2026
पहले ‘शुद्धिकरण’ किया गया। फिर उत्तराखंड भाजपा अध्यक्ष ने… https://t.co/vUm9FzPSOp
'రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు- కాంగ్రెస్ రియాక్ట్'
మరోవైపు, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కులతత్వ భావజాలంపై పూర్తి శక్తితో పోరాటం సాగిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటామని పేర్కొంది. ఈ విషయంలో బీజేపీ తీరుపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా ఎక్స్ పోస్టులో తీవ్రంగా విరుచుకుపడ్డారు.
"ఖర్గే సభ అనంతరం వేదికను శుద్ధీకరణ చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు, కానీ ఆ కులతత్వ చర్యకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదేనా బీజేపీ ప్రభుత్వ న్యాయం? ఇది యాదృచ్ఛికం కాదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల 'దళిత, రాజ్యాంగ వ్యతిరేక' మనస్తత్వానికి ఉదాహరణ. ఈ మొత్తం విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని కుమారి సెల్జా వ్యాఖ్యానించారు.
'కేసుల భయంతో వెనక్కి తగ్గుతామన్న భ్రమను వీడండి'
కేసుల భయంతో రాహుల్ గాంధీ గానీ, కాంగ్రెస్ గానీ వెనక్కి తగ్గుతామన్న భ్రమను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తొలగించుకోవాలని కుమారి సెల్జా అన్నారు. అది గాంధీ కుటుంబమని, దేశం కోసం త్యాగం, అంకితభావంతో పనిచేసిన చరిత్ర వారికి ఉందని గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్‌లు గానీ, అధికార ఒత్తిడి గానీ వారి గళాన్ని భయపెట్టలేవని ఆమె ఉద్ఘాటించారు.
ఇదిలా ఉండగా, మల్లికార్జున ఖర్గే నిర్వహించిన కార్యక్రమానికి కుల రంగు పులిమారనే ఆరోపణలపై రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, మతపరమైన భావాలను దెబ్బతీసే ఉద్దేశపూర్వక చర్యలకు సంబంధించిన నిబంధనల కింద ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. అలాగే, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం 1989లోని నిబంధనలను కూడా ఇందులో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

