ETV Bharat / bharat

బిహార్​లో మళ్లీ NDAదే అధికారం- మహాకూటమికి 100లోపే సీట్లు- ఎగ్జిట్ పోల్స్ అంచనా

బిహార్​ ఎగ్జిట్ పోల్స్​- ఎన్​డీఏ Vs మహాగఠ్​బంధన్- మళ్లీ నీతీశ్​ సర్కార్ వైపే బిహార్ ఓటర్లు- సర్వే సంస్థల అంచనా

Bihar Exit Polls 2025 Updates
Bihar Exit Polls 2025 Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 11, 2025 at 6:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bihar Exit Polls 2025 Updates : అందరూ అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. బిహార్​లో మరోసారి ఎన్​డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కాగా మహాగఠ్​బంధన్​కు వచ్చే సీట్లు 100 సీట్లలోపు ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇక ప్రశాంత్ కిశోర్​కు చెందిన జన్​ సురాజ్​ ప్రభావం అంతంత మాత్రమే అని స్పష్టం చేస్తున్నాయి. ఇతర పార్టీల పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది.

మళ్లీ అధికార పీఠం ఎన్​డీఏకే!
మెజారిటీ సర్వేలు ఈసారి కూడా ఎన్​డీఏదే అధికారమని చెబుతున్నాయి. 'పీపుల్ పల్స్' ఎన్​డీఏకు 133-159 సీట్లు, మహాగఠ్​బంధన్​కు 75-101 సీట్లు, జేఎస్​పీకి 0-5 సీట్లు, ఇతరులకు 2-8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 'పీపుల్ ఇన్​సైట్' సర్వే ఎన్​డీఏకు 133-148 సీట్లు, మహాగఠ్​బంధన్​కు 87-102 సీట్లు, జేఎస్​పీకి 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని పేర్కొంది. 'మ్యాట్రిజ్'​ ఎన్​డీఏకు 147-167 సీట్లు, మహాగఠ్​బంధన్​కు 70-90 సీట్లు, జేఎస్​పీకి 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

'జేవీఎస్​ పోల్స్' అయితే ఎన్​డీఏకు ఏకంగా 135-150 సీట్లు వస్తాయని పేర్కొంది. మహాగఠ్​బంధన్​ 88-103 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 3-6 సీట్లు సాధించవచ్చని తెలిపింది. దైనిక్ భాస్కర్​ ప్రకారం, ఈసారి ఎన్​డీఏకు 145-160 సీట్లు, మహాగఠ్​బంధన్​కు 73-91 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రశాంత్​ కిశోర్​కు చెందిన జేఎస్​పీ కనీసం ఖాతా కూడా తెరవకపోవచ్చని పేర్కొంది. ఇతరులు 0-3 సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది.

'పీ-మార్క్​' సర్వే ప్రకారం, ఎన్​డీఏకు 142-162 స్థానాల్లో, మహాగఠ్​బంధన్​ 80-98 స్థానాల్లో, జేఎస్​పీ 1-4 స్థానాల్లో, ఇతరులు 0-3 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా. 'చాణక్య స్ట్రాటజీస్​' అంచనా ప్రకారం, ఈ ఎన్నికల్లో ఎన్​డీఏ 130-138 సీట్లు, మహాగఠ్​బంధన్ 100-108 సీట్లు, జేఎస్​పీ -0, ఇతరులు 3-5 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది.

రాహుల్, తేజస్విలకు మరోసారి నిరాశ తప్పదా?
బిహార్​లో చాలా కాలంగా అధికారం లేక విలవిలలాడుతున్న కాంగ్రెస్​, ఆర్​జేడీలకు చాలా ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చేలా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, తేజస్వి యాదవ్​ ముఖ్యమంత్రి కల మరోసారి నిరాశగా మిగిలే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎన్నో అంచనాల మధ్య ప్రశాంత్ కిశోర్ పెట్టిన జన్ సురాజ్​ పార్టీకి ఘోర వైఫల్యం తప్పేలా లేదు. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు, చిన్నాచితకా పార్టీల పరిస్థితి మరిచెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది.

పీపుల్స్‌ పల్స్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ133-159
మహాగఠ్​బంధన్​75-101
జేఎస్​పీ0-5
ఇతరులు2-8
పీపుల్స్‌ ఇన్‌సైట్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ133-148
మహాగఠ్​బంధన్​87-102
జేఎస్​పీ0-2
ఇతరులు3-6
మ్యాట్రిజ్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ147-167
మహాగఠ్​బంధన్​70-90
జేఎస్​పీ0-2
ఇతరులు2-8
జేవీసీ పోల్స్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ135-150
మహాగఠ్​బంధన్​88-103
ఇతరులు3-6
దైనిక్‌ భాస్కర్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ145-160
మహాగఠ్​బంధన్​ 73-91
జేఎస్​పీ0
ఇతరులు5-10
పీ-మార్క్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ142-162
మహాగఠ్​బంధన్​ 80-98
జేఎస్​పీ1-4
ఇతరులు0-3
చాణక్య స్ట్రాటజీస్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ130-138
మహాగఠ్​బంధన్​ 100-108
జేఎస్​పీ0
ఇతరులు3-5
డీవీ రీసెర్చ్‌
కూటమి/ పార్టీసీట్లు​
ఎన్​డీఏ137-152
మహాగఠ్​బంధన్​ 83-98
జేఎస్​పీ2-4
ఇతరులు1-8

నోట్​ : ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ఆయా సంస్థల అంచనాలు మాత్రమే. ఇవి కొన్నిసార్లు నిజం కావచ్చు. కొన్నిసార్లు పూర్తి భిన్నమైన ఫలితాలు కూడా రావచ్చు. గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి.