ఛార్జింగ్ అవసరం లేని ఎలక్ట్రిక్ సైకిల్- భారత విద్యార్థి వినూత్న ఆవిష్కరణ
సౌర, పవన శక్తులతో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్- డైనమోతోనూ నడిచేస్తుంది- రాత్రి కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు!

Published : January 10, 2026 at 11:47 AM IST
Bicycle Generates Electricity : జనరేషన్ మారుతున్నకొద్దీ వాహనాలు కొనుగోలు చేయడంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు పెట్రోల్ బైక్‌లు వినియోగించేవారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. వీటివల్ల ఛార్జింగ్ సడెన్‌గా అయిపోతే ఏం చేయాలో తెలియదు. అంతేకాక ఛార్జింగ్ కోసం ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. అయితే, ప్రపంచాన్ని సాంకేతికతకు మరింత దగ్గర చేసేలా, ప్రజలను అడ్వాన్స్‌గా అప్డేట్ చేసేలా ఓ విద్యార్థి నూతన ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. మరి అదేెంటో తెలుసుకుందాం రండి!
గుజరాత్ భావ్‌నగర్‌లోని జ్ఞానమంజరి ఇన్నోవేటివ్ విశ్వవిద్యాలయం మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థి లల్లీ క్రిష్. ఈ విద్యార్థి ఛార్జింగ్ అవసరం లేని సైకిల్‌ను సృష్టించారు. దీనిని వాడడం వల్ల ఛార్జింగ్ లేదు అనే ఇబ్బంది ఉండదు. ఛార్జింగ్ పద్ధతులు మారుతూ ఉన్నప్పటికీ, ఈ పద్ధతులన్నీసైకిల్‌లో విలీనం చేసి ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలికారు.
"నేను తయారు చేసిన సైకిల్ పవనశక్తి, సౌరశక్తి, డైనమోతో పనిచేసేలా తీర్చిదిద్దాను. ఇందుకోసం నేను మెకానికల్ ఇంజనీరింగ్‌ను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌తో కలిపాను. సైకిల్ వెనక భాగంలో ఒక చిన్న విండ్ టర్బైన్ ఏర్పాటు చేశాను. హ్యాండిల్‌బార్‌లో ఓ ఫ్యాన్‌ను అమర్చాను. ఇది పవన శక్తిన ఉత్పత్తి చేస్తుంది. నా సైకిల్లో డైనమో కూడా ఏర్పాటు చేశా. నేను బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో బ్యాటరీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది. సైకిల్ వెనుక భాగంలో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశా. దీని వల్ల సౌర విద్యుత్ లభిస్తుంది. అందువల్ల ఈ సైకిల్‌కు ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు. దీనికంతటికీ దాదాపు రూ.10వేలు ఖర్చు అయ్యింది.
- లల్లీ క్రిష్, విద్యార్థి
విద్యార్థి లల్లీ క్రిష్ సైకిల్ సౌరశక్తి, పవనశక్తి ,డైనమో శక్తిని మిళితం చేస్తుంది. సహజంగానే, బ్యాటరీ అయిపోయినప్పుడు ఏదైనా విద్యుత్ వాహనాన్ని ఛార్జ్ చేయాలి. అయితే లల్లీ క్రిష్ తయారు చేసిన సైకిల్‌ను నడుపుతున్నప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. అది నేరుగా పవన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బ్రేక్‌లు వేసినప్పుడు, డైనమో దానితో తిరుగుతుంది, తద్వారా డైనమో శక్తిని అందిస్తుంది. పగటిపూట సోలార్ ప్యానెల్ ద్వారా సౌరశక్తి లభిస్తుంది. పవన శక్తి, డైనమో శక్తి రాత్రిపూట కూడా బ్యాటరీని ఛార్జ్ చేస్తూనే ఉంటాయి. అందువల్ల, బ్యాటరీని ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి దాదాపు ఉండదు అని లల్లీ క్రిష్ చెబుతున్నాడు.
స్టూడెంట్ లేజీనెస్‌తో ఒక కొత్త ఆవిష్కరణ
మరోవైపు, నలంద బిహార్ షరీఫ్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిల్ అలోక్ ప్రస్తుతం రాంచీలోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అతడికి హాస్టల్‌లో ఉంటున్నప్పుడు చలికాలంలో ఒక సమస్య వచ్చింది. చలికి దుప్పటి కప్పుకుని పడుకున్నాక, లైట్ లేదా ఫ్యాన్ ఆపాలంటే లేవడానికి చాలా బద్ధకంగా ఉండేది. ఆ చిన్న బద్ధకమే అతడిని ఆలోచింపజేసింది. తన ఇంజినీరింగ్ చదువును, కోడింగ్ నైపుణ్యాన్ని వాడి దీనికి పరిష్కారం వెతికాడు. అదే ఇప్పుడు 'స్మార్ట్ బ్రెయిన్' ఆవిష్కరణగా మారింది. అనిల్ రూపొందించిన ఈ పరికరానికి 'రోబో' అని పేరు పెట్టాడు. ఇది మన ఇళ్లలో ఉండే పాత స్విచ్ బోర్డుల్లో ఇట్టే అమరిపోతుంది. దీని కోసం ఇళ్లంతా వైరింగ్ మార్చాల్సిన పని లేదు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 'హే రోబో, ఫ్యాన్ ఆపు' అని మనం అనగానే, అందులోని మైక్రోఫోన్లు మన గొంతును గుర్తుపడతాయి. వెంటనే మైక్రో కంట్రోలర్ ద్వారా సిగ్నల్ పంపి ఫ్యాన్ లేదా లైట్‌ను ఆపేస్తాయి.
జాక్‌పాట్ కొట్టిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి - రూ.2.5 కోట్ల వేతనంతో జాబ్ ఆఫర్
హాస్టల్ బాలికల 'ఆర్గానిక్ స్టార్టప్'- రూ.20లకే ఫుడ్ ఐటమ్స్- వ్యాపారంతో పాటు సామాజిక సేవ

