ఎన్నికలు 2026- కేరళలో కాంగ్రెస్, బంగాల్‌లో బీజేపీ, తమిళనాడు టీవీకే సంబరాలు
కేరళలో కాంగ్రెస్, బంగాల్‌లో బీజేపీ, చెన్నైలో టీవీకే పార్టీ కార్యకర్తల సంబరాలు- మిఠాయిలు పంచుకుంటూ, నృత్యాలు చేస్తూ

Published : May 4, 2026 at 11:51 AM IST
Assembly Election 2026 : కేరళ, బంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, టీవీకే దూసుపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులు కౌంటింగ్లో విజయపథంలో దూసుకుపోవడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF చాలా చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, డ్రమ్స్ వాయిస్తూ సంబురాలు జరుపుకున్నారు. పలుచోట్ల కార్యకర్తలు జెండాలతో రోడ్లపైకి చేరి కేరింతలు కొట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే, బంగాల్‌లో బీజేపీ దూసుకెళ్తుండటంతో ఆయా పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు, చెన్నైలోని టీవీకే పార్టీ ఆఫీస్ వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. దీంతో టీవీకే పార్టీ ఆఫీస్, ఇంటి వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
బంగాల్‌లో బీజేపీ సంబరాలు
బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను ఛేదించి, తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే 180 ఆధిక్యంలో కొనసాగుతోన్న బీజేపీ శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 105 ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో, నందిగ్రామ్, భవానీపుర్ నియోజకవర్గం నుంచి బంగాల్ ప్రతిపక్ష అభ్యర్థి, అలాగే బీజేపీ అభ్యర్థి అయిన సువేంధు అధికారి, తమ పార్టీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. బంగాల్‌లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు భవానిపుర్లో కూడా హోరాహోరీ కొనసాగుతోందన్నారు. అలాగే, తమ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోవడంతో బీజేపీ శ్రేణులు కోల్కతాలోని బీజేపీ కార్యాలయం వెలుపల రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
VIDEO | West Bengal Election Results: BJP leaders and workers distribute sweets outside Sakhawat Memorial Government Girls' High School in Kolkata.#WestBengalPollResults2026#Results2026WithPTI#AssemblyElectionResults2026
— Press Trust of India (@PTI_News) May 4, 2026
(Full video available on PTI Videos -… pic.twitter.com/lO4jvv9aHF
VIDEO | Delhi: Celebrations erupt at the AICC Headquarters as Congress led UDF leads in the initial trends in Kerala.#KeralaPollResults2026#Results2026WithPTI#AssemblyElectionResults2026
— Press Trust of India (@PTI_News) May 4, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ChM5TxUxUE
#WATCH | Delhi: Celebrations outside the BJP Headquarters, as the party crosses the majority mark in Assam and leads in West Bengal. Counting is underway. pic.twitter.com/HwhRaFGUXj
— ANI (@ANI) May 4, 2026
VIDEO | West Bengal Election Results: Celebrations outside BJP office in Kolkata as trends show party leading in state.#WestBengalPollResults2026 #Results2026WithPTI #AssemblyElectionResults2026
— Press Trust of India (@PTI_News) May 4, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/36QM56lSg3
కేరళలో UDF టాప్
ఇక, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి 98 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మెజారిటీ మార్కును అధిగమించడంతో, తిరువనంతపురంలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్, ఎంపీలు శశి థరూర్, కె. సురేశ్ సంబరాల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అయితే, ఓట్ల లెక్కింపు ముందుకు సాగే కొద్దీ ట్రెండ్‌లు తారుమారు అవుతాయని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్‌డీఎఫ్ పాలనలో రాష్ట్రం నుంచి పేదరికాన్ని నిర్మూలించామని, అదే సమయంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రతా చర్యల విషయంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేరళ ప్రజలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎల్‌డీఎఫ్‌కు మద్దతు ఇస్తారని, అది రాబోయే రౌండ్లలో ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Keralam Elections 2026 | Celebrations underway at the Congress Headquarters in Thiruvananthapuram as the Congress-led UDF has crossed the majority mark of 71 seats in the state.
— ANI (@ANI) May 4, 2026
Party's General Secretary (Organisation) K.C. Venugopal, state party chief Sunny Joseph, LoP… pic.twitter.com/gX7eHXyJJg
VIDEO | Kerala Election Results: Congress workers celebrate, lift party leader Ramesh Chennithala (@chennithala) in joy at party office in Thiruvananthapuram as UDF takes big lead.#KeralaPollResults2026 #Results2026WithPTI #AssemblyElectionResults2026
— Press Trust of India (@PTI_News) May 4, 2026
(Full video available on… pic.twitter.com/Cu7NiUPKXb
తమిళనాడులో టీవీకే విజిల్ సౌండ్
మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయాన్ని పురస్కరించుకుని పనైయూర్‌లో టీవీకే మద్దతుదారులు స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని ట్రెండ్స్ ప్రకారం, నటుడు-రాజకీయవేత్త అయిన విజయ్ టీవీకే పార్టీ 103 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే దూసుకుపోవడంతో విజయ్ కుటుంబ సభ్యులు తమ నివాసం వద్ద ఈలలు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే, 67 స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ ఉంది. అయితే, అధికార డీఎంకే మాత్రం 62 స్థానాలతో మూడో స్థానానికి చేరింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ, ఏఐఏడీఎంకే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) బలమైన స్థితిలో ఉందని బీజేపీ నాయకురాలు గీతా ప్రియ సోమవారం అన్నారు.
#WATCH | Tamil Nadu Elections 2026 | Family of TVK chief and actor Vijay blow whistles and celebrate at their residence, as the party continues its lead in the state. It is currently leading on 104 of the total 234 seats in the state.
— ANI (@ANI) May 4, 2026
(Video Source: TVK PRO) pic.twitter.com/Ya9iT2MFNH
దళపతికి తమిళ ఓటర్ల సర్‌ప్రైజ్- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ TVK
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ పవర్ కట్- సీసీటీవీ కెమెరాలు ఆఫ్: మమత ఆరోపణలు

