ETV Bharat / bharat

డ్రగ్స్​ అమ్మకాలపై నిలదీత- సామాజిక కార్యకర్తను కాల్చి చంపిన షాపు యజమాని

మెడికల్‌ షాపుల్లో జరుగుతున్న డ్రగ్స్‌ దందాను బహిర్గతం చేస్తున్న ఓ సామాజిక కార్యకర్తను ఆ షాపు యజమాని తుపాకీతో దారుణంగా కాల్చిచంపాడు. ఈ దారుణమైన ఘటన పంజాబ్‌లో జరిగింది.

Anti Drug Activist Shot Dead Punjab
ప్రతీకాత్మక చిత్రం (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : October 13, 2026 at 4:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Anti Drug Activist Shot Dead Punjab : పంజాబ్‌లోని మెడికల్‌ షాపుల్లో జరుగుతున్న డ్రగ్స్‌ దందాను బహిర్గతం చేస్తున్న ఓ సామాజిక కార్యకర్తను ఆ షాపు యజమాని తుపాకీతో దారుణంగా కాల్చిచంపాడు. మాన్సా జిల్లాలో జరిగిన ఈ దృశ్యాలు మృతిచెందిన ఆ సామాజిక కార్యకర్త పర్వీందర్‌ సింగ్‌ ఫోన్‌లో నిక్షిప్తం అయ్యాయి. పర్వీందర్‌ సింగ్‌ కొన్నేళ్లుగా పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఔషధాల దుకాణంలో డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలిసి అక్కడకు వెళ్లారు. షాపు యజమానిని ప్రశ్నిస్తూ అదంతా తన ఫోన్‌లో రికార్డు చేస్తున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న నాటు తుపాకీని తీసి పర్వీందర్‌ను ఆ షాపు యజమాని హెచ్చరించాడు. అయినా పర్వీందర్‌ భయపడలేదు. ఈ క్రమంలో దుండగుడు కాల్పులు జరిపి పర్వీందర్‌ ప్రాణాలు తీశాడు.

పర్వీందర్​ హత్య నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
మరోవైపు, డ్రగ్స్​కు వ్యతిరేకంగా ప్రశ్నించిన గొంతును కాల్చి చంపేయడం పంజాబ్​లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల వైఫల్యంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెలువడుతున్నాయి. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో చేపట్టిన ప్రచారంపై ప్రశ్నలు గుప్పిస్తూ, భగవంత్​ మాన్​ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

రాష్ట్రంలో పట్టపగలే జరిగిన పర్వీందర్​ హత్య, భగవంత్​ మాన్​ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని పంజాబ్​ కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాజా వారింగ్ విమర్శించారు. అలాగే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న ప్రచార వైఫల్యానికి నిదర్శనమని ఎక్స్​వేదికగా ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పర్వీందర్ సింగ్​ చేసిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని ఆరోపించారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. గతంలో 2023లో పర్వీందర్‌పై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తండ్రిని కలిసినట్లు రాజా వారింగ్​ గుర్తుచేసుకున్నారు. పంజాబ్‌లో డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్తను పట్టపగలే హత్య చేయడం, ఆప్ ప్రభుత్వంలో 'డ్రగ్ మాఫియా' ఎంత శక్తిమంతంగా ఉందో చూపిస్తోందని మరో కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా విమర్శించారు. పంజాబ్​ ప్రభుత్వం చేపట్టిన మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితమైందని దుయ్యబట్టారు. పంజాబ్‌లో రాజకీయ నాయకులు-పోలీసులు-డ్రగ్ మాఫియా హవా నడుస్తోందని ఆరోపించారు.

సామాజిక కార్యకర్తను కాల్చి చంపిన షాపు యజమాని (ETV Bharat)

డ్రగ్స్​ ముఠాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
ఇదిలా ఉండగా, పంజాబ్​లో డ్రగ్స్​ రవాణాకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5 వేర్వేరు ముఠాలను అమృత్​సర్​ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్​లో 10 మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి భారీగా మాదకద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అమృత్‌సర్ పోలీస్ కమిషనరేట్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిందితుల వద్ద నుంచి 6 పిస్టళ్లు, 12 తూటాలు, 4.409 కిలోల హెరాయిన్, 500 గ్రాముల నల్లమందు, రూ.12.90 లక్షల నగదు, ఒక డ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

రూ. 22.98 లక్షల విలువైన హెరాయిన్ పట్టివేత
మరోవైపు, అసోంలోని తేజ్​పుర్​లో డ్రగ్స్​కు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. ఈ నెలలో(అక్టోబర్​) సోనిత్​పుర్​లో నిర్వహించిన వేర్వేరు దాడుల్లో 17 మందిని అరెస్టు చేశారు. అలాగే, నిందితుల వద్దనుంచి లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆపరేషన్‌లో ముగ్గురు అనుమానిత డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేయడంతో పాటు, జిల్లాలోని ఒక ఇంట్లో హెరాయిన్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) మౌసుమి కలితా ప్రకారం, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మాదకద్రవ్యాల నిరోధక డ్రైవ్‌లో భాగంగా సుమారు రూ. 22.98 లక్షల విలువైన 110 గ్రాముల హెరాయిన్, దాదాపు రూ. 10.79 లక్షల విలువైన 21.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇండీ కూటమి పిటిషన్​లో 14 లోపాలు- సవరిస్తే విచారిస్తామని చెప్పిన సుప్రీంకోర్టు

'ఉగ్రవాదంపై భారత్ వెనక్కి తగ్గదు- వారికి ఆశ్రయం లేకుండా చూడాలి'- BIMSTEC దేశాలకు అమిత్​షా పిలుపు