ETV Bharat / bharat

10,000 నాణేలు, 500 స్టాంపులు- సతీశ్​ కలెక్షన్​ సూపర్​- తొలి భారతీయుడిగా రికార్డ్​!

మైసూరులో ​'రంగాయణ' 25 రజతోత్సవ ఉత్సవాల సందర్భంగా నాణేల ప్రదర్శన- 10000 నాణేలు సేకరించిన భారతీయుడిగా రికార్డు

Ambedkar Stampm Coins Exhibition
Ambedkar Stamps Coins Exhibition (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 15, 2026 at 11:05 AM IST

3 Min Read
Choose ETV Bharat

Ambedkar Stamps Coins Exhibition : కర్ణాటకలోని మైసూర్​లో 'రంగాయణ' 25 రజతోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో వివిధ రకాల నాటకాలు, హస్తకళలు, ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది బాబాసాహెబ్​ అంబేడ్కర్​ చిత్రాలు ఉన్న అరుదైన స్టాంపులు, రాజుల కాలం నాటి నాణేలను ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రదర్శనల్లో ఓ వ్యక్తి తాను 20 సంవత్సరాలుగా సేకరించిన దాదాపు పదివేల నాణేలను ప్రదర్శనలో ఉంచారు. ఆ వ్యక్తి గురించి ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

కోలార్ జిల్లా ముళుబాగిల్​కు చెందిన హెచ్​కే సతీశ్​ వృత్తి రీత్యా హాసన్ ప్రిన్సిపల్, జిల్లా సెషన్స్ కోర్టులో సెకండ్ క్లాస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అంబేడ్కర్​ సందేశాలను దేశ నలుమూలలా వ్యాప్తి చేయడానికి, కళామందిర్‌లోని సుచిత్ర ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ స్టాంపులు, నాణేలు, ఫొటోల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అదే విధంగా తాను 20 సంవత్సరాలుగా సేకరించిన అరుదైన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శతజయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) విడుదల చేసిన ప్రత్యేక నాణేలను సేకరించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు పర్యటించారు. ఇలా దాదాపు 10,000 నాణేలను సేకరించారు. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా ఆయన నిలిచారు. మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి రెండో స్థానంలో ఉన్నారు.

Ambedkar Stampm Coins Exhibition
అంబేడ్కర్ స్టాంపులు, నాణేల ప్రదర్శన (ETV Bharat)

సేకరించిన 500 స్టాంపుల్లో 150 స్టాంపులు అంబేడ్కర్​కు సంబంధించినవే!
అయితే, 1965లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 75వ జయంతి సందర్భంగా మొదటి స్టాంపును విడుదల చేశారు. అప్పటి నుంచి బాబాసాహెబ్ స్టాంపులు, రాజ్యాంగంలోని అధికరణలకు అనుగుణంగా ఉన్న ఇతర స్టాంపులు, స్వాతంత్ర్య సమరయోధుల 500 ప్రత్యేక స్టాంపులు ప్రదర్శనల్లో ఉంచారు. ఇప్పటి వరకు ఆయన సేకరించిన 500 స్టాంపుల్లో 150 స్టాంపులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​కు సంబంధించినవేనని ఆయన తెలిపారు. అదేవిధంగా తాను సేకరించిన 10 వేల నాణేలు కూడా అంబేడ్కర్​కు చెందినవేనని పేర్కొన్నారు. అయితే ప్రదర్శనల్లో కొన్ని నాణేలు మాత్రం స్వాతంత్ర్య సమరయోధులు, రాజులు, రాజ్యాంగం సంబంధించినవి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

Ambedkar Stampm Coins Exhibition
నాణేల ప్రదర్శన (ETV Bharat)

సతీశ్​ నాణేలను సేకరించడానికి తన సొంత డబ్బుతో దేశంలోని నలుమూల ప్రాంతాలకు పర్యటించారు. ఇప్పటివరకు ఆయన 147 ప్రదర్శనలు నిర్వహించారు. అందులో కేవలం 20 నుంచి 22 ప్రదర్శనల్లో మాత్రమే ఆయనకు గౌరవ వేతనం, ప్రయాణ ఖర్చులు లభించాయి. ఇదిలా ఉండగా, సతీశ్​ తన అద్భుత ప్రదర్శనకు గానూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో లిమ్కా, గిన్నిస్ రికార్డులకు దరఖాస్తు చేసుకుంటానని సతీశ్ పేర్కొన్నారు.

4 జాతీయ అవార్డులు
సతీశ్​ ప్రపంచంలోనే మొట్టమొదటి ఖాదీ పోస్టేజ్ స్టాంపు, 3D స్టాంపు, ప్లాస్టిక్ స్టాంపు, ప్రపంచంలోనే మొట్టమొదటి సిల్క్ ఎన్వలప్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టాంపులన్నింటినీ కూడా ఆయన సేకరించారు. ఇందుకు గానూ ఆయన 4 జాతీయ అవార్డులను అందుకున్నారు.

20 దేశాలకు చెందిన 3,000 నాణేలు, నోట్లు సేకరణ!
ఇలాంటిదే మరోచోట, బంగాల్​లో హుగ్లీ జిల్లా పాండువాకు చెందిన భాస్కర్ మండల్ జాగ్రఫీ టీచర్. ఈయనకు పురాతన కాయిన్స్, కరెన్సీ నోట్లను సేకరించడమంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు ఆయన 20 దేశాలకు చెందిన 3,000 నాణేలు, నోట్సను సేకరించి తన ఇంట్లోనే భద్రపరిచుకున్నారు. వృత్తిరీత్యా విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులను నేర్పడంతో పాటు కాయిన్స్​ను సేకరించుకుంటూ తన అభిరుచిని తీర్చుకుంటున్నారు ఆ టీచర్​. ఇప్పటివరకు సేకరించిన వాటిలో మొఘల్, దిల్లీ సుల్తానుల కాలం నాటి కాయిన్స్, నోట్లు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ వెండి, రాగి వంటి లోహాలతో తయారుచేసినవే. ఈ నాణేలతో తన ఇంట్లో ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలని భాస్కర్ భావిస్తున్నారు. ఈ సేకరణను విద్యార్థులు భవిష్యత్తులో పరిశోధనల కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నారు.

జాగ్రఫీ టీచర్ ప్యాషన్- 20 దేశాలకు చెందిన 3000 నాణేలు, కరెన్సీ నోట్లు సేకరణ

500ఏళ్ల నాటి అరుదైన నాణేలు- రూ.200కే మొఘల్​​, బ్రిటీష్ కాలం నాటి కాయిన్స్​