ETV Bharat / bharat

గాలిలోని తేమ నుంచి నీటి ఉత్పత్తి - రోజుకు 50లీటర్ల నీరు అందించే 'ఏరో వాటర్​'

నీటి కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాల వినూత్న ఆలోచన- విద్యుత్ ద్వారా పనిచేసే వాటర్​ ప్యూరిఫయర్​ పరికరం - అటవీ ప్రాంతాల వారికి అందుబాటులోకి వచ్చిన స్వచ్ఛమైన నీరు

Aero Water Purifier In Government School
Aero Water Purifier In Government School (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 5:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Aero Water Purifier In Government School : దేశం ఎంత అభివృద్ధి చెందినా, ఇంకా కొన్ని గ్రామాలకు నీటి కొరత కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఈ విషయాన్ని గమనించి ఒక వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలలోని విద్యార్థుల కోసం తాగు నీటిని ఉత్పత్తి చేసేందుకు 'ఏరో వాటర్​' అనే పరికరాన్ని ప్రవేశపెట్టింది. అసలు ఏంటా పరికరం? అది ఎలా నీటిని ఉత్పత్తి చేస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ పాఠశాల వినూత్న ఆలోచన
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో తాగునీటి సంక్షోభాన్ని తగ్గించడానికి చామరాజనగర్​లోని సోమవార్​పేట ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఓ నిర్ణయం తీసుకంది. అందులో భాగంగా ఓ 'ఏరో వాటర్​' అనే పరికరాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది ఈ పరికరం​ గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయిన నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. ఇది విద్యుత్తు ద్వారా పని చేసే యంత్రం.

భూగర్భజలం లేదా వర్షపాతంతో పని లేదు
ఈ పరికరం ఏరో వాటర్ అనే కంపెనీ నుంచి వచ్చిన సాంకేతికత. ఇది వాతావరణం నుంచి తేమను సేకరించి, అనంతరం దాన్ని కండెన్స్​ చేస్తుంది. తర్వాత ఆ నీరును శుద్ధి చేసి తాగడానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఈ సాంకేతికత ప్రత్యేకత ఏమిటంటే, భూగర్భజలం లేదా వర్షపాతంపై ఆధారపడకుండా ఉంటుంది. అలాగే ఏడాది పొడవునా నిరంతరం నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకనే ఈ ఏరో వాటర్​ పరికరాన్ని ఉపయోగించడానికి వర్షాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

Aero Water Purifier In Government School
గాలిలోని తేమ నుంచి నీటి ఉత్పత్తి చేసే 'ఏరో వాటర్​' (ETV Bharat)

రోజుకు 50 లీటర్ల నీరు ఉత్పత్తి
ఈ ఏరో వాటర్​ రోజుకు 45-50 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగల యంత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఆచరణలోకి వచ్చే సరికి 50 లీటర్ల సామర్థ్యం గల యంత్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్తు​తో పని చేసే ఈ పరికరానికి సౌరశక్తిని కూడా అనుసంధానించుకోవచ్చు.

అటవీ ప్రాంతాల్లో నివసించేవారికి!
ఈ ఏరో వాటర్​ సాంకేతికత మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలను దృష్టిలో ఉంచుకుని ఈ సాంకేతికతను ఆచరణాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ పరికరం సాయంతో పాఠశాలలోని పిల్లలు స్వచ్ఛమైన నీరును తాగుతున్నారు.

"మా పాఠశాలలో నీటి కొరత తీవ్రంగా ఉంది. అందుకే మా డీసీ మేడమ్, గాలి నుంచి నీటి సాంకేతికతతో ఉన్న యంత్రాన్ని మాకు ఇచ్చారు. ప్రస్తుతం ఇది నమూనా మోడల్​ యంత్రం మాత్రమే. దీని పనితీరు చూసేందుకే ఆమె దీనిని మాకు ఇచ్చారు. ఆమె సహకారం మాకు చాలా ప్రయోజనం చేకూరుస్తోంది. గాలి నుంచి తేమను గ్రహించి నీటిని ఉత్పత్తి చేసే ఈ సాంకేతికత చాలా అద్భుతంగా ఉంది"
- నాగలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు

ఎంత తేమ ఉంటే అంత నీరు
ఈ ఏరో వాటర్​ పరికరం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు, తక్కువగా ఉన్నప్పుడు తక్కువ నీరును ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఇది రోజుకు 48 లీటర్ల నీరును అందిస్తుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 83 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పరికరం నుంచి వచ్చే నీటిని ప్రదానంగా తాగడానికి ఉపయోగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగిస్తారు. ఉత్పత్తి అయిన నీరు ఎంతో రుచిగా ఉంటుందని అక్కడి పిల్లలు తెలిపారు.

స్కూల్​కు డుమ్మా కొడితే మ్యూజిక్కే మ్యూజిక్​- విద్యార్థుల ఇళ్లకు మేళతాళాలతో టీచర్

సొంతిల్లు లేని పేద సర్పంచ్- ఊరందరికీ ప్రభుత్వ పథకాలు- ఆమెకు మాత్రం నో!