ETV Bharat / bharat

వైద్య దంపతుల అరుదైన సేవ- ఇంటి టెర్రస్ నుంచి మరణ వార్తల ప్రకటన- అవయవ దానంపై అవగాహన!

బెళగావిలో వైద్య దంపతుల సేవపై ప్రశంసలు- మరణ వార్తలను తమ ఇంటి టెర్రస్​పై ప్రకటన - అవయవ దానంపైనా అవగాహన కల్పన

Death news annoncing Docters
Death news annoncing Docters (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 7:17 AM IST

3 Min Read
Choose ETV Bharat

Docters Humanity By Death Statement : ఒకప్పుడు ఏదైనా వార్తలను, లేదా సమాచారాన్ని చెప్పాలంటే ఒక వ్యక్తి దండోరా వేస్తూ అందరికీ తెలిసేలా చెప్పేవారు. కానీ స్మార్ట్​ ఫోన్స్​ వచ్చాక తీరు మారిపోయింది. ఏ చిన్న విషయాన్ని అయిన అందరూ సోషల్​ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇలాంటి స్మార్ట్ యుగంలో అందరికీ తెలియసేలా దండోరా వేస్తూ చెప్పడం అంటే కష్టమే. కానీ కర్ణాటకు చెందిన డాక్టర్ దంపతులు మాత్రం గత ఎనిమిదేళ్లుగా అదే చేస్తున్నారు. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఇంటి టెర్రస్​పై లౌడ్ స్పీకర్ ద్వారా ప్రజల మరణవార్తలను తెలియజేస్తున్నారు. ఇంతకీ వారెందుకు ఇలా చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బెళగావిలోని బైలహోంగల్‌కు చెందిన డాక్టర్ మహేంతేశ్ రామన్నవర్, భార్య డాక్టర్ సురేఖా తమ ఇంటిని 'మరణ వార్తల ప్రకటన కేంద్రం'గా మార్చారు. ఇంటి టెర్రస్‌పై అమర్చిన లౌడ్‌స్పీకర్ ద్వారా, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా, మరణించిన వారి వివరాలను ఉచితంగా ప్రకటిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేస్తున్న ఈ సేవకు పట్టణ ప్రజల నుంచి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. డాక్టర్ రామన్నవర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. కోసం 'శ్రద్ధాంజలి' పేరుతో 5 వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 5,000 మంది దాకా సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 2,500 మంది మరణవార్తలను ఈ గ్రూపుల ద్వారా చేరవేశారు.

Docters Humanity By Death Statement
మరణ వార్తల ప్రకటన కోసం టెర్రస్​పై మైక్ (ETV Bharat)

'ఓం నమః శివాయ'తో మూడు సార్లు ప్రకటన
ప్రస్తుతం ఈ పనిని డాక్టర్ సురేఖా రామన్నవర్ చూసుకుంటున్నారు. డాక్టర్ సురేఖ రామన్నవర్ ఒక డెంటల్ సర్జన్. సంగోళి రాయన్న సర్కిల్ సమీపంలో క్లినిక్ నడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులతో బిజీగా ఉంటారు. అయినప్పటికీ ట్రస్ట్ నిర్వహించే 'శ్రద్ధాంజలి' వాట్సాప్ గ్రూప్‌లకు మరణ సమాచారం వచ్చిన వెంటనే, కొద్ది నిమిషాలు కేటాయించి ఆడియో ప్రకటనను రికార్డు చేస్తారు. కొన్నిసార్లు కన్సల్టేషన్ల మధ్యలో వాష్‌రూమ్‌లోకి వెళ్లి కూడా ఈ పని చేస్తారు. ఆ ఆడియోను 'ఓం నమః శివాయ'తో ప్రారంభమవుతుంది. మృతుని పూర్తి పేరు, వయసు, ప్రాంతం, వీధి, అంత్యక్రియల వివరాలు ప్రకటనను మూడుసార్లు ప్రసారం చేసి స్పష్టంగా వినిపిస్తారు. దీంతో నివాసితులకు మరణ వార్తను సకాలంలో తెలుసుకోవడంతో పాటు అంత్యక్రియలకు హాజరు కావడానికి చాలా సులభతరమవుతోంది.

Docters Humanity By Death Statement
డాక్టర్ మహేంతేశ్ రామన్నవర్, డాక్టర్ సురేఖా రామన్నవర్ (ETV Bharat)

'మసీదు నుంచి వచ్చే ప్రకటనల వల్లే'
మసీదుల నుంచి వచ్చే మరణ ప్రకటనలే తనను ప్రభావితం చేశాయని డాక్టర్ మహాంతేశ్ రామన్నవర్ ఈటీవీ భారత్​కు తెలిపారు. 'పోలీసుల అనుమతి తీసుకుని, 2017లో తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవను ప్రారంభించా. ప్రారంభంలో ఇది భావోద్వేగంగా కష్టంగా అనిపించినా, సమాజానికి అవసరమని భావించి కొనసాగించా. ప్రారంభ దశలో బాబన్న యాదహల్లి అనే స్థానిక వ్యక్తి స్వచ్ఛందంగా ప్రకటనలు నిర్వహించా. తరువాత నాకు వీలుకాకపోవడంతో, నా భార్య డాక్టర్ సురేఖ రామన్నవర్ చూసుకుంటున్నారు. మరణానికి మతం ఉండదని, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ఈ భావనతోనే అన్ని మతాల వారికి ఉచితంగా మరణ వార్తలు ప్రకటిస్తున్నాం.' అని మహాంతేశ్ పేర్కొన్నారు.

కొవిడ్ సమయంలో బ్రేక్
కొవిడ్ మహమ్మారి సమయంలో, నిబంధనల కారణంగా మరణ ప్రకటనలు తాత్కాలికంగా నిలిపివేశామని డాక్టర్ రామన్నవర్ తెలిపారు. ఆ సమయంలో, కరోనాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి స్పీకర్‌ను పోలీసులు, ఆరోగ్య శాఖకు ఇచ్చారని తెలిపారు. సిబ్బంది తమ ఇంటికి వచ్చి ప్రకటనలు చేసేవారని చెప్పారు.

అవయవ దానంపై అవగాహన
ఇక డాక్టర్ మహంతేశ్ రామన్నవర్, కేఎల్ఈ బీఎంకే ఆయుర్వేద మెడికల్ కాలేజీలో అనాటమీ విభాగం ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా పనిచేస్తున్నారు. అంతేకాదు, శరీర, అవయవ, కంటి, రక్తదానం వంటి కార్యక్రమాలను డాక్టర్ రామన్నవర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సహిస్తున్నారు. శరీర దానంపై అవగాహన కోసం తన తండ్రి శరీరాన్ని తానే డిసెక్షన్ చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి భారతీయ డాక్టర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 'మరణం చెడ్డది కాదు- మరణ భయం చెడ్డది' అన్నదే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన తన ఇంటిపై చనిపోయిన వారి పేర్లను ప్రకటిస్తున్నారు.

స్థానికుల ప్రశంసలు
వేద పండితుడు వీరయ్య హిరేమఠ్, ఈ సేవను మహోన్నతమైన కార్యంగా అభివర్ణించారు. ఉచితంగా మరణ వార్తలు ప్రకటించడం అరుదైన, పుణ్యకార్యమని పేర్కొంటూ, ఈ దంపతులకు సేవ చేయగల శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థించారు. గతంలో మరణ వార్తలు ఆలస్యంగా తెలిసేవని, ఇప్పుడు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూర గ్రామాలకు కూడా వెంటనే సమాచారం చేరుతోందని స్థానికులు అంటున్నారు. శరీర దానం చేసిన వారి పేర్లను గౌరవంగా ప్రకటించడం సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోందని తెలిపారు.

టీచర్ సామాజిక సేవ- 200కు పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు

66వేల అనాథ శవాలకు అంత్యక్రియలు- 13ఏళ్లలో రూ.6 కోట్ల ఖర్చు- CA నిత్యానంద్ తివారీ సేవా ప్రస్థానం