ETV Bharat / bharat

13 ఏళ్ల నిరీక్షణకు కన్నీటి ముగింపు- ఆపరేషన్​ కోసం ఎదురుచూస్తూనే​ 15 ఏళ్ల బాలిక మృతి!

దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ కన్నుమూసిన తన్వీ- రెండేళ్ల వయసు నుంచే గుండె జబ్బుతో పోరాటం- చికిత్సలో నిర్లక్ష్యంపై తండ్రి ఆరోపణలు

Kota Girl Dies at Delhi AIIMS
దిల్లీ ఎయిమ్స్, తన్వీ ఫైల్ ఫొటో (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 9:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kota Girl Dies at Delhi AIIMS : 13 ఏళ్లుగా ఆరపరేషన్​ కోసం ఎదురుచూసిన ఓ బాలిక చివరికి కన్నుమూసింది. దేశ రాజధాని దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న రాజస్థాన్​ కోటాకు చెందిన 15 ఏళ్ల తన్వీ మంగళవారం మృతి చెందింది. పుట్టుకతోనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న ఆమెకు సకాలంలో శస్త్రచికిత్స జరగలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆసుపత్రి చుట్టూ తిరిగినా ఆపరేషన్‌ జరగకపోవడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజస్థాన్​లోని కోటాకు చెందిన తన్వీకి వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్​డీ), పల్మనరీ అట్రేసియా వంటి సంక్లిష్టమైన పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఉన్నాయి. ఆమెకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం దిల్లీలోని ఎయిమ్స్​కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల ప్రకారం, 2014లో ఎయిమ్స్​ వైద్యులు తన్వీకి శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఆ తర్వాత 2015లో ఆపరేషన్​కు తేదీ కూడా నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో శస్త్రచికిత్స వాయిదా పడుతూ వచ్చిందని తండ్రి ఆరోపించారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా తమ కుమార్తెకు అవసరమైన ఆపరేషన్ జరగలేదన్నారు.

మరణానికి కారణం చెప్పలేదన్న బాలిక తండ్రి
సర్జరీ కోసం ఎయిమ్స్​లో ఎన్నోసార్లు సంప్రదించినా, ఒక తేదీ తర్వాత మరో తేదీ ఇస్తూ కాలం గడిపారని బాలిక తండ్రి ముకేశ్ పరియాణి ఆరోపించారు. సకాలంతో ఆపరేషన్ చేసి ఉంటే తన కుమార్తెకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కన్నీటి పర్యంతమయ్యాయి. ఇటీవల ఆగస్టు 24 నుంచి 31 వరకు కూడా వైద్యులు తన కుమార్తెను సరిగా పరీక్షించలేదని ఆయన ఆరోపించారు. తన్వీ మృతికి సరైన కారణాన్ని ఎయిమ్స్​ అధికారులు తమకు స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. చికిత్స సమయంలో పదేపదే పత్రాల పేరుతో ఇబ్బందులకు గురిచేశారని, కొన్ని సందర్భాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల పాటు చికిత్స కోసం తిరిగిన తమ కుటుంబానికి చివరకు కుమార్తెను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అనుమానాలు ఉన్నాయని, మొత్తం వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తమ ప్రశ్నలకు ఆస్పత్రి నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు కుమార్తె మృతదేహాన్ని స్వీకరించబోమని చెప్పారు.

ఎయిమ్స్‌ వైద్యుల వివరణ ఏమిటంటే
మరోవైపు తన్వీ చికిత్స విషయంలో ఎయిమ్స్‌ వైద్యులు భిన్నమైన వివరణ ఇస్తున్నారు. 2018లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళాలు అయిన పల్మనరీ ఆర్టరీలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అటువంటి పరిస్థితిలో సాధారణ కరెక్టివ్ సర్జరీ చేయడం ప్రమాదకరమని భావించామని, అందుకే ఆపరేషన్ చేయకుండా వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొన్నారు. అనంతరం వ్యాధి పరిస్థితిని బట్టి చికిత్స కొనసాగించినట్లు ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు.

హార్ట్‌-లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం వర్కప్‌
ఎయిమ్స్‌ రికార్డుల ప్రకారం, తన్వీని ఆగస్టు 24న మరోసారి ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు సాధారణ శస్త్రచికిత్సకు బదులుగా గుండె, ఊపిరితిత్తుల సంయుక్త మార్పిడి (హార్ట్‌-లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌) అవసరమా? అనే అంశంపై వైద్యులు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ పరీక్షలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం సుమారు 7 గంటలకు తన్వీకి ఎండోస్కోపీ నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.50 గంటలకు తీవ్ర నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు. పరీక్షించగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి 48 శాతానికి పడిపోయింది. వెంటనే వైద్యులు ఆక్సిజన్‌ అందించడంతో పాటు అత్యవసర చికిత్స ప్రారంభించారు. బాలికను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమించింది. చివరకు ఉదయం సుమారు 5.06 గంటలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఆగ్రాలో ఇద్దరికి ఎబోలా పాజిటివ్- హైఅలర్ట్​ ప్రకటన!

"చీరను తాడుగా మార్చి తోటి ప్రయాణికులను కాపాడాము"- నేపాల్ విపత్తు భయానక అనుభవాలను షేర్ చేసుకున్న దంపతులు