ప్రాణం మీదకు తెచ్చిన 'సెల్ఫీ'! 100అడుగుల లోయలో పడ్డ యువతి - Girl Fell In Gorge

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 4:27 PM IST

thumbnail
Woman Fell In Gorge While Taking Selfie (ETV Bharat)

Woman Fell In Gorge While Taking Selfie : మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశం బోరాన్‌ ఘాట్‌లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా 100 అడుగుల లోయలోకి జారి పడింది. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతుండటం వల్ల పర్యటకులు భారీగా పోటెత్తారు. పుణెకు చెందిన ఓ పర్యటక బృందం బోరాన్ ఘాట్‌ సందర్శనకు వచ్చింది. బృందంలోని నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా జారి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డు, స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించామని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. అధిక వర్షాల వల్ల మట్టి జారుడుగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి, జిల్లాలోని పర్యటక ప్రాంతాలను శనివారం నుంచి సోమవారం వరకు  మూసివేయాలని ఆదేశించారు. పర్యటక ప్రాంతాల సందర్శనకు వచ్చిన యువత ప్రమాదకర ప్రదేశాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.