మార్కెట్​లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్​కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు - Traders Caught Mobile Thief

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 3:46 PM IST

thumbnail
మార్కెట్​లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్​కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు (ETV Bharat)

Traders Caught Mobile Thief and Crushed in Karimnagar : తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో ఉన్న రైతు బజార్​లో సెల్‌ఫోన్‌ చోరీ చేస్తున్న ఓ దొంగను కూరగాయల వ్యాపారులు కట్టేసి చితకబాదారు. రైతు బజార్​లో ప్రతి శనివారం కూరగాయల కోసం వచ్చే వారి నుంచి సెల్​ఫోన్లు పోవడంతో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. రూ.50 వేలు విలువ చేసే మొబైల్​లను టార్గెట్ చేసుకొని దొంగలు సెల్ ఫోన్లను చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. ఈరోజు రైతు బజార్​లో సెల్ ఫోను దొంగిలించే ప్రయత్నంలో వ్యాపారస్థులు ఓ దొంగను పట్టుకున్నారు.

Traders Beat Mobile Thief at Market Video : దొరికిన దొంగను పోలుకు కట్టేసి కూరగాయల వ్యాపారస్థులు చితకబాదారు. మహారాష్ట్ర, నాగపూర్ నుంచి వచ్చిన నలుగురు పథకం వేసి సెల్​ఫోన్లను దొంగలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో సెల్​ఫోన్​ను దొంగిలించే దొంగను పట్టుకొని స్థానికులు చితకబాదారు. ప్రతి శనివారం పదుల సంఖ్యలో సెల్​ఫోన్లు పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.