నాగర్‌కర్నూల్‌లో నాగ్ అశ్విన్ పర్యటన - స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి చేయూత - tollywood director Nag Ashwin
Published : Aug 10, 2024, 4:58 PM IST
Film Director Nag Ashwin visits Nagarkurnool : తండ్రి చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తన వంతుగా తోడ్పాటు అందించారు. నాగ్ అశ్విన్ తాత అయిన సింగిరెడ్డి పర్వత్‌రెడ్డి పేరుతో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చారు. భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని నాగ్ అశ్విన్ తెలిపారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హీరోలు, దర్శకులు కాకపోయినా, డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదిగి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నాగర్కర్నూల్ జిల్లా ఐతోల్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూచకుల్లా రాజేశ్ రెడ్డి, కలెక్టర్ బడావత్ సంతోశ్‌తో పాటు నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని నాగ్ అశ్విన్ తెలిపారు. నాగర్ కర్నూల్ ప్రాంతానికే ప్రపంచంలో గుర్తింపు తెచ్చే విధంగా, ఈ ప్రాంతం నుంచి నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఎదగడం చాలా సంతోషమని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.