LIVE : శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సింహవాహన సేవపై శ్రీనివాసుడు - Tirumala Simha Vahana Seva Live
🎬 Watch Now: Feature Video
Tirumala Simha Vahana Seva Live : గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం చిన్నశేష వాహన సేవ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడుగంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనాన్ని అధిరోహించారు. గ్యాలరీల్లో భక్తులు స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. మూడో రోజు ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహ వాహనసేవ జరుగుతోంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు వాహనసేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వర నృత్య కళాశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బృందాల ప్రదర్శనలు ఆహూతులను అలరిస్తున్నాయి. సింహ వాహన సేవ - ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Oct 6, 2024, 10:08 AM IST