thumbnail

విజయవాడలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ - ఆమె సేవలను కొనియాడిన ప్రముఖులు - Mollamamba statue inauguration

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 9:02 PM IST

Mollamamba Statue Inauguration Ceremony in Vijayawada : మొదటి మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఏపీ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, మైసూరు ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ ముఖ్య అతిధిగా హాజర‌య్యారు. తెలుగువారికి చదవడానికి వీలులేని రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన కవయిత్రి మొల్ల అని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనమన్నారు. 

అనంతరం వక్తలు మాట్లాడుతూ, మహిళలు చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన కవయిత్రి మొల్ల అని కొనియాడారు. ఆరు కాండాలు, 871 పద్యాలతో కూడిన రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనమన్నారు. రామాయణం అందరికీ ఆదర్శం, ఆచరణీయమని అన్నారు. కవయిత్రి మొల్ల సమాజ శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడ్డారని తెలిపారు. 2017లోనే కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించి మొల్ల మాంబను గౌరవించిందని గుర్తు చేశారు. విజయవాడలో మొల్ల కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఏపీ కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. విజయవాడలో మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని వక్తలు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.