చల్లగా గోదావరి - ఎర్రగా ఆకాశం - యానాంలో కనువిందు చేసిన దృశ్యం - Red Sky in Yanam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 10:48 PM IST
Red Sky in Yanam : ఆకాశంలో ఏవైనా మార్పులు జరిగినా ఎలాంటి కొత్తదనం కనిపించినా సాధారణంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. కొన్ని చూసినప్పుడు ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు. ఇదే తరహాలో కాకినాడ జిల్లా కేంద్రపాలితం ప్రాంతమైన యానాంలోని రాజీవ్ బీచ్ వద్ద గురువారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంధ్యాకాల సమయంలో ఓవైపు ముదురు గోధుమ వర్ణంలో వడివడిగా సముద్రం వైపు పరుగులు పెడుతున్న గౌతమీ గోదావరి, ఆకాశంలో అస్తమించే సూర్యుడు తిలకం దిద్దినట్టు మరోవైపు.
ఈ దృశ్యం సందర్శకులను, ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. గోదావరి ప్రవాహం వీక్షించేందుకు వచ్చిన వారంతా ఆకాశంలో ఏర్పడిన ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య చకితులయ్యారు. ప్రకృతి నడుమ కనువిందు చేసిన ఈ సుందర దృశ్యాలను వెంటనే తమ సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.