LIVE : అంబర్పేట రామ్లీలా మైదానంలో రావణ దహనం
🎬 Watch Now: Feature Video
Ravana Dahan In Hyderabad Live : రాష్ట్రవ్యాప్తంగా దసరా సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా, పట్టణం, నగరంలో అంతా పండుగ సందడి కనిపిస్తోంది. ఉదయం పూజలు, దావత్ల అనంతరం సాయంత్రం అంతా కొత్త బట్టలు కట్టుకొని శమీపూజ కోసం జమ్మిచెట్టు వద్దకు చేరుకుంటున్నాయి. జమ్మి ఆకులు తీసుకొని పాలపిట్ట దర్శనం చేసుకుంటున్నారు. దసరా రోజు శమీపూజలో పాల్గొని పాలపిట్ట దర్శనంతో సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ద్వాపరయుగంలో అజ్ఞాతవాసం అనంతరం పాండవులు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాల కోసం ముందుగా చెట్టుకు పూజ చేసి అనంతరం ఆయుధాలను తీసుకున్నారు. ఆ సమయంలో వారికి పాలపిట్ట కనిపించింది. అది వారికి శుభప్రదంగా మారింది. అప్పటి నుంచి విజయ దశమి రోజు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర మంతటా దసరా సందడి వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అన్ని ముఖ్యకేంద్రాల్లో రావణ దహనానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని అంబర్పేట రామ్లీలా మైదానంలో రావణ దహనం వేడుకలను ప్రత్యక్షంగా చూద్దాం.
Last Updated : Oct 12, 2024, 9:28 PM IST