LIVE : 103 రైల్వేస్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని - NEW RAILWAY STATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 22, 2025 at 11:05 AM IST

1 Min Read
Virtual Inauguration of 3 Railway Stations : అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా కొత్తగా రూపుదిద్దుకున్న 103 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీటిని వర్చువల్​గా ప్రారంభించారు. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో జరిగిన వేడుకలో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్​లో, పొన్నం ప్రభాకర్​ కరీంనగర్​లో, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బేగంపేట ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వేడుకకు హాజరయ్యారు. ఇవాళ ప్రారంభించిన బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. ఈ స్టేషన్లలో ప్రయాణికులకు అనువుగా ఫుట్‌పాత్‌లు, విశాలమైన ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైనేజ్ బోర్డుల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లకు అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల కింద భారీగా బడ్జెట్‌ కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలను ప్రత్యక్షప్రసారం ద్వారా చూద్దాంConclusion:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.