ఇసుక ట్రాక్టర్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Police Head Constable Accident
Published : Aug 15, 2024, 5:26 PM IST
Police Head Constable Accident In Warangal : వరంగల్ జిల్లాలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. వరంగల్ వైపు ఇసుక లోడుతో వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీని ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో హెల్మెట్ కింద పడిపోవడంతో ఆయన మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మామునూరు నాలుగవ బెటాలియన్‌లో బాలాజీ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై విధులకు హాజరయ్యే సమయంలో రోడ్డు మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న సన్నివేశాలు అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.