LIVE: 'అడవితల్లి బాట' - డుంబ్రిగూడ బహిరంగ సభలో పాల్గొన్న పవన్​కల్యాణ్​ - PAWAN TOUR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 7, 2025 at 1:33 PM IST

Updated : April 7, 2025 at 2:32 PM IST

1 Min Read
LIVE: అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ పెదపాడు గ్రామంలో పర్యటించారు పర్యటనల భాగంగా స్థానిక గిరిజనుల సమస్యలను విన్నారు. స్థానిక కౌందు భాషలో వారితో మాట్లాడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను 6 నెలలలో తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు పవన్​ శంకుస్థాపన చేశారు. పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేశారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్ బాక్స్​లను ఇచ్చారు. గ్రామస్తులతో ముఖాముఖిలో వారు అడిగిన 12 సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కు డిప్యూటీ సీఎం సూచించారు. జన్ మన్ పథకం కింద అల్లూరి ఏజెన్సీకి 167 రోడ్లు మంజూరయ్యాయన్నారు. మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే, ఈ రహదారులను పోరాడి సాధించామన్నారు. పవన్​ కల్యాణ్​ పర్యటనను లైవ్​లో చూద్దాం. 
Last Updated : April 7, 2025 at 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.