రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థినులు - హాస్టల్స్ కేటాయించాలని ధర్నా - Nizam College students Protest

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 2:34 PM IST

thumbnail
రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థులు - హాస్టల్స్ కేటాయించాలని ధర్నా (ETV Bharat)

Nizam College Students Protest : హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని నిజాం కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన చేశారు. కళాశాలలో నిర్మించిన హాస్టళ్లను పూర్తిస్థాయిలో డిగ్రీ విద్యార్థినులకే కేటాయించాలని డిమాండ్​ చేస్తు రోడ్డెక్కారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థులకు వాహనదారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పారు. వినకపోవడంతో పోలీసులు విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. 

నిజాం కాలేజీలో 2022లో యూజీ విద్యార్థినులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించారని, ఆ ఏడాది హాస్టల్​లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువ ఉండటం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారన్నారు. అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని వారికి హాస్టల్​లో అడ్మిషన్ దొరకకపోవడంతో బయట ప్రైవేట్ హాస్టల్​లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యూజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు ఇస్తాని హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.