రాజమహేంద్రవరం వాసుల కల నెరవేరింది- మోరంపూడి ఫ్లై ఓవర్ ప్రారంభం - Morampudi Flyover Launched
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2024, 7:07 PM IST
Morampudi Flyover Launched MP Purandeswari : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాసుల చిరకాల కోరిక నెరవేరింది. నిర్మాణం పూర్తి చేసుకున్న మోరంపూడి ఫ్లై ఓవర్‌ను ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. మోరంపూడి జంక్షన్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణ, ట్రాఫిక్ రద్దీ క్రమబద్దీకరించేందుకు పై వంతెన నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ NHAI ఆధ్వర్యంలో పూర్వపు ఉభయగోదావరి జిల్లాల్లోని మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం, తేతలి, కైకరం వద్ద ఐదు పై వంతెనల నిర్మాణం చేపట్టారు.
120 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పై వంతనల్లో మోరంపూడి పై వంతెన పూర్తి చేశారు. సృష్టి కాంట్రాక్ట్ సంస్థ ఈ పై వంతన నిర్మాం 2023 నవంబర్‌లో ప్రారంభించి పూర్తి చేసింది. మిగతా ఐదు కూడా పూర్తి చేసి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభిస్తామని ఎంపీ పురందేశ్వరి చెప్పారు. రాజమహేంద్రవరం వాసుల చిరకాల కోరిక అయిన మోరంపూడి పై వంతన పూర్తచేయడం సంతోషిచదగ్గ విషయమని మంత్రి చెప్పారు.