thumbnail

ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం డ్యాన్స్​ - వీడియో వైరల్​ - Danam Dance at Khairatabad Ganesh

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 5:33 PM IST

MLA Danam Dance at Khairatabad Ganesh Shobha Yatra : తొమ్మిది రోజులు పూజలందుకున్న ఖైరతాబాద్​ గణనాథుడు మంగళవారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కన్నులపండువగా దర్శనమిచ్చిన స్వామి శోభాయాత్ర ఘనంగా జరిగింది. భాగ్యనగరంలో ఇవాళ జరిగిన గణేశ్ ​నిమజ్జనంలో భాగంగా చిన్నారులు, యువతి, యువకులతో పాటు ప్రజా ప్రతినిధులు నృత్యాలతో హోరెత్తించారు. 

గణేశ్​ శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం డ్యాన్స్​ : ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్రలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి డ్యాన్స్ చేశారు. యువత సైతం ఎమ్మెల్యే దానం నాగేందర్​తో డ్యాన్స్ చేస్తూ 'జై గణేశ్​ మహారాజ్​ కీ జై' అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాన్ని ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.      

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.