LIVE : శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ - ప్రత్యక్ష ప్రసారం - MISS WORLD CONTESTANTS VISIT
🎬 Watch Now: Feature Video


Published : May 22, 2025 at 8:39 AM IST
|Updated : May 22, 2025 at 10:52 AM IST
1 Min Read
Miss World Contestants Visits Shilparamam Live : ప్రపంచ సుందరీమణులు శిల్పారామాన్ని సందర్శిస్తున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలు మే10వ తేదీన ప్రారంభమవ్వగా మే31 వరకు జరగనున్నాయి. ప్రపంచానికి తెలంగాణ పర్యాటకాన్ని పరిచయం చేయడం కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పలు సందర్శనీయ ప్రాంతాలకు సుందరీమణులు వెళ్తున్నారు. దీనికి తెలంగాణ జరూర్ ఆనా ట్యాగ్‌లైన్ పెట్టారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదగిరి గుట్ట, రామోజీ ఫిల్మ్‌సిటీ, భూదాన్ పోచంపల్లి, పిల్లలమర్రి, ఏఐజీ హాస్పిటల్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఇవాళ పలు దేశాలకు చెందిన సుందరీమణులు శిల్పారామంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం నిన్నరాత్రే జరగాల్సి ఉంది కానీ వర్షం వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అందగత్తెల పర్యటనను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : May 22, 2025 at 10:52 AM IST