LIVE : కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌లో మిస్ వరల్డ్ పోటీదారులు - MISS WORLD CONTESTANTS
🎬 Watch Now: Feature Video


Published : May 22, 2025 at 12:49 PM IST
|Updated : May 22, 2025 at 1:49 PM IST
1 Min Read
Miss World Contestants in Victoria Memorial Orphanage : మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ అనాథశ్రమాన్ని సందర్శిస్తున్నారు. ఉదయం శిల్పారామం వెళ్లిన అందగత్తెలు అక్కడి నుంచి విక్టోరియా భవనం వద్దకు వచ్చారు. మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడున్న చిన్నారులతో ఆసక్తిగా ముచ్చటించారు. మిస్ వరల్డ్ పోటీదారుల్లో సామాజిక సేవలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అనాథశ్రమాలు నడుపుతున్న వారు, సోషల్ సర్వీస్ చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులపై ప్రచారం చేసేవారు ఉన్నారు. పోటీదారులు హోమ్ లోని పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ లాబ్‌ను ప్రారంభించారు. 1903 సంవత్సరంలో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ నిర్మించిన ఈ అద్భుత విక్టోరియా హోమ్‌లో ప్రస్తుతం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల నడుస్తోంది. 70 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉంది. ఈ భవనం మొత్తం అంతస్తు వైశాల్యం 7,676 చదరపు మీటర్లు మరియు మొదటి అంతస్తు వైశాల్యం 1,250 చదరపు మీటర్లు. విక్టోరియా మెమోరియల్‌లో అందగత్తెల పర్యటనను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : May 22, 2025 at 1:49 PM IST