LIVE: మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - NARA LOKESH PRESS CONFERENCE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : June 13, 2025 at 5:27 PM IST
|Updated : June 13, 2025 at 5:59 PM IST
1 Min Read
Minister Nara Lokesh Press Conference: మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. కొందరు తల్లుల ఖాతాలు యాక్టివ్ లేక నిధులు తిరిగి వచ్చాయని, ఆయా ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో అతి కీలకమైనది తల్లికి వందనం అని సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని ముందే చెప్పామని, అలా చెప్పినట్లు గానే అందరికీ ఇస్తున్నామని అన్నారు. 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని దానికి రూ.10,091 కోట్లు ఖర్చు అవుతుంది వివరించారు. ఇంకా ఈ నిధుల నుంచి స్కూళ్ల డెవలప్‌మెంట్‌కు రూ.1,346 కోట్లు వెళ్తాయని అన్నారు. అమ్మ ఒడి మార్గదర్శకాలే పాటిస్తూ అదనంగా ఎంతమంది పిల్లలున్నా ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. గత ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మ ఒడి ఇచ్చిందని కాని కూటమి ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నామని వెల్లడించారు. అలానే ఈ పథకానికి గత ప్రభుత్వం రూ.5,540 కోట్లు ఖర్చుపెడితే తాను రూ.8,745 కోట్లు ఇస్తున్న విషయం తెలిసిందే.
Last Updated : June 13, 2025 at 5:59 PM IST