thumbnail

ప్రజల ప్రాణాలను కూడా లేక్కచేయడం లేదు- బ్యారేజీ విధ్వంసానికి కుట్రలు చేశారు: మంత్రి అనిత్ - Minister Anita Allegations on YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 8:17 PM IST

Minister Anita Allegations on YSRCP Leaders: ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి వైసీపీ నేతలు కుట్ర పన్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు. భారీ పడవలు ప్రకాశం బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను ఢీకొన్న ఘటనపై జలవనరులశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేశారని అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కూడా లెక్కచేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి కుట్రలకు పాల్పడ్డవారు దేశద్రోహులంటూ హోం మంత్రి అనిత మండిపడ్డారు. పది రోజులుగా వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని అన్నాకు. 

ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉండాలని విజయవాడ కలెక్టరేట్‌లోనే సీఎం బస ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. పూర్తిస్థాయిలో సహాయచర్యలను సీఎం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జగన్ రెండుసార్లు బయటికొచ్చి బురద చల్లిపోయారని విమర్శించారు. 3 బోట్లను లంగరు కూడా వేయకుండా చిన్న తాడుతో ఎందుకు కట్టారని మంత్రి ప్రశ్నించారు. ఇవాళ్టివరకు బోట్లు పోయాయని ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారని ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి అనిత వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.