thumbnail

రోడ్డుపై మిల్క్ ట్యాంకర్ బోల్తా - బకెట్లతో ఎగబడ్డ ప్రజలు - Milk Tanker Overturned

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 9:09 PM IST

Milk Tanker Overturned in Telangana : పాల ట్యాంకర్‌ బోల్తా పడటంతో వాటిని పట్టుకునేందుకు బకెట్లతో జనం ఎగబడ్డ ఘటన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై పాలతో వెళ్తున్న మినీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. కూడలిలో స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా వాహనాన్ని డ్రైవర్ వేగంగా నడపటంతో  వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్​ ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు వెనుక ఉన్న పాల ట్యాంకర్​ పగిలిపోయింది.

ట్యాంకర్​ పగలడం వల్ల చాలా వరకు పాలు నేలపాలు కాగా మిగిలిన పాలను బకెట్లు, బాటిళ్లతో పట్టుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.