LIVE: మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ ప్రారంభం - ప్రత్యక్ష ప్రసారం - MASULA BEACH FESTIVAL 2025 LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : June 5, 2025 at 5:43 PM IST
|Updated : June 5, 2025 at 7:35 PM IST
1 Min Read
Masula Beach Festival 2025 at Machilipatnam: మసులా బీచ్‌ఫెస్ట్ మచిలీపట్నంలోని మంగినపూడి సముద్రతీరం వద్ద ప్రారంభం అయింది. నేటి నుంచి నాలుగురోజుల పాటు నిర్వహించే వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సముద్ర పండుగకు లక్షలాదిగా సందర్శకులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద ఈవెంట్ మసులా బీచ్ ఫెస్ట్‌కు మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ, కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహించే మసులా బీచ్ ఫెస్టివల్‌కు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. ఎమ్యూజ్ మెంట్, ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు. తెలుగు వారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
Last Updated : June 5, 2025 at 7:35 PM IST