అక్క ఇంటికి వెళ్లేందుకు అంబులెన్స్ చోరీ - ప్రమాదానికి గురై మళ్లీ అదే ఆస్పత్రిలో చికిత్స - AMBULANCE THEFT IN SIDDIPET
Published : Aug 8, 2024, 12:13 PM IST
Ambulance Theft In Siddipet : ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడు సోదరి దగ్గరికి వెళ్లేందుకు అక్కడే ఉన్న ఓ అంబులెన్స్ వేసుకుని వెళ్లాడు. కానీ అనుకున్నట్టుగా ఆ వ్యక్తి తన సోదరి ఇంటికి చేరుకోలేదు. సీన్ కట్ చేస్తే ప్రమాదానికి గురై మళ్లీ అంబులెన్స్ కొట్టేసిన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగింది అంటే? : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అశోక్ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యం బాగోలేదని వచ్చాడు. తిరిగి తన అక్క ఇంటికి వెళ్లేందుకు అక్కడ ఎదుట నిలిపిన ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ను చోరీ చేశాడు. ఈ చోరీ చేసిన వాహనంలో రాజీవ్ రహదారిపై వెళ్తుండగా దుద్దెడ టోల్‌గేట్ సమీపంలో అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆంబులెన్స్‌లో ఉన్న అశోక్‌ను విచారించగా తన అక్క వద్దకు వెళ్లేందుకు చోరీకి పాల్పడినట్టు వెల్లడించాడు. సిద్దిపేట ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.