గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తున్న 'మ్యాజిక్' బస్ - ప్రపంచవ్యాప్తంగా సంస్థ సేవలు - Magic Bus Skill Development Program - MAGIC BUS SKILL DEVELOPMENT PROGRAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : September 28, 2024 at 10:03 PM IST
Magic Bus Skill Development Program : చదువులు పూర్తయ్యేలోపు ఉద్యోగం పొందాలంటే అందుకు తగిన నైపుణ్యాలు కూడా ఉండాలి. మార్కులు ఎంత అన్నది కాదు ఏం నేర్చుకున్నాం అనేదే ఇక్కడ ప్రధానం. ప్రతిభను ప్రదర్శిస్తేనే ఉద్యోగ అవకాశాలు. ఇంటర్వ్యూల్లో సత్తా చాటితేనే మంచి ప్యాకేజీతో కొలువు. అయితే ఇవన్నీ సాధించాలంటే మీకు వారధిగా మేము ఉన్నాం అంటుంది మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ.
మార్కెట్ అవసరాలను బట్టి విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ సేవలను అందిస్తోంది. 60కిపైగా కంపెనీలతో కలిసి యువతకు ఉపాధి కల్పన కల్పిస్తోంది. కళాశాలలకు వెళ్లి ఫ్రీగా శిక్షణ ఇస్తోంది. ఇలా ప్రతి నెల 300కుపైగా స్టూడెంట్స్కు ఉద్యోగ అవకాశం లభిస్తోంది. మరి, ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలు, విద్యార్థులు రాత, మౌఖిక పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి? స్టూడెంట్స్ ఎలా ముందుకు వెళ్తే మేలు జరుగుతుందో వివరిస్తున్నారు మ్యాజిక్ బస్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ పుష్పలత.