సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం - ప్రమాదమా? కుట్ర పూరితమా! - Sub Collector Office Fire Accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 11:01 AM IST
|Updated : Jul 22, 2024, 5:42 PM IST
Madanapalle Sub Collector Office Fire Accident in Annamayya District : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్యాలయ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి.
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదమా?, కుట్ర పూరితమా? అనే కోణంలో విచారణకు సీఎం ఆదేశించారు. ఘటనను ప్రభుత్వం అంత్యంత సీరియస్ గా తీసుకుంది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్ లో వెళ్లాలని డీజీపీకి ఆదేశించారు. డీజీపీ, సీఐడీ చీఫ్ కొద్దిసేపట్లో మదనపల్లి బయలుదేరనున్నారు.