LIVE : లోక్‌సభ సమావేశాలు - Lok Sabha 2024 Session Live
Published : Aug 6, 2024, 11:06 AM IST
|Updated : Aug 6, 2024, 7:02 PM IST
Lok Sabha Budget Session Live : లోక్‌సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత సభలో బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేంద్రం (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌కు గత మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. గత సమావేశాల్లో కేరళ వయనాడ్‌లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై పార్లమెంట్ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. మరోవైపు తిరిగి ఇవాళ మళ్లీ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు, భారత్ తీసుకుంటున్న అప్రమత్త చర్యల గురించి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Aug 6, 2024, 7:02 PM IST