thumbnail

LIVE : ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు - ప్రత్యక్షప్రసారం - Ganesh idol set up in Khairatabad

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 12:54 PM IST

Updated : Sep 7, 2024, 6:36 PM IST

Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్​ గణేశుడుకి తొలి పూజ పూర్తి అయింది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేతులు మీదగా తొలి పూజలు చేశారు. నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణేశుడిని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్​ గణేశుడిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా రాష్ట్రప్రభుత్వం భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వీరు చూసుకుంటారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఏవీ తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి విశిష్టతలు ఏడు ముఖాలతో, కుడివైపు ఏడు, ఎడమ వైపు ఏడు చేతులతో మొత్తం 14 చేతులతో దర్శనమిస్తారు. ఖైరతాబాద్​ వినాయకుడిని దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అధిక మొత్తంలో పోటెత్తిన భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈటీవీ భారత్​ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
Last Updated : Sep 7, 2024, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.