LIVE : తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - KTR LIVE FROM TELANGANA BHAVAN
🎬 Watch Now: Feature Video


Published : May 24, 2025 at 11:23 AM IST
|Updated : May 24, 2025 at 11:29 AM IST
1 Min Read
KTR Live From Telangana Bhavan : సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు కావాలంటే తెలంగాణ నుంచి తరలిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై పలు విమర్శలను గుప్పించారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా పేరుతో వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈడీ ఛార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించరని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్ఆర్ ట్యాక్స్‌పై ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి దిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు ప్రధాని మోదీ అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : May 24, 2025 at 11:29 AM IST