LIVE : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు - MLA MAGANTI GOPINATH PASSES AWAY
🎬 Watch Now: Feature Video


Published : June 8, 2025 at 3:37 PM IST
|Updated : June 8, 2025 at 4:11 PM IST
1 Min Read
Jubilee Hills MLA Maganti Gopinath Passes Away Live : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఈ నెల 5న ఆయన ఏఐజీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నెల 5న మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఉండగా, ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, ఎమ్మెల్యే కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు గుర్తించారు. అనంతరం సీపీఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకుంది. నాడీ, బీపీ సాధారణ స్థితికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగించారు. గత కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా గుండెపోటు రావడంతో 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఆయన ఇంటి ఆవరణలో ఉంచారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతున్నాయి.
Last Updated : June 8, 2025 at 4:11 PM IST