శ్రీహరికోట నుంచి రేపు ఉదయం ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం: సోమనాథ్ - ISRO to Launch SSLV
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 5:53 PM IST
ISRO to Launch SSLV : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు ఉదయం SSLV-D3 ప్రయోగం జరుగుతుందని ఇస్రో చైర్మన్ శ్రీధర పనికర్ సోమనాథ్ (ISRO Chairman Sreedhara Panicker Somanath) తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ హరికోట లోని స్పేస్ సెంటర్ స్కూల్‌లో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ ఆశయ సాధన దిశగా అడుగులు : జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా దళాల నుంచి శ్రీధర పనికర్ సోమనాథ్ గౌరవ వందనం స్వీకరించారు. 2047 నాటికి రాకెట్ ప్రయోగాల్లో వికసిత్ భారత్‌గా నిలవాల్సి ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయ సాధన దిశగా అడుగులు వేయాల్సి ఉందని సోమనాథ్ అన్నారు. ప్రయోగాలు విజయవంతం కావడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ప్రతిభావంతులకు బహుమతులను ఆయన అందజేశారు.