LIVE : తెలంగాణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - INTERNATIONAL YOGA DAY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : June 21, 2025 at 7:04 AM IST

Updated : June 21, 2025 at 8:10 AM IST

1 Min Read
International Yoga Day in Telangana Live : రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యోగా చేయడం వల్ల చేకూరే ఆరోగ్య లబ్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా చేసేందుకు కార్యక్రమాలు చేపట్టారు. యోగా చేయడంలో నిష్ణాతులైన వారితో యోగా ఆసనాలు వేపిస్తున్నారు. కొన్ని రోజుల నుంచే స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకు యోగాసనాలు వేయిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్​ వర్మ హాజరయ్యారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వచ్చారు. యోగాసనాలు వేయడానికి విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్​లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. విద్యార్థులు, స్థానికులతో కలిసి యోగసనాలు వేశారు. వీటన్నింటిని ఇప్పుడు ప్రత్యేక ప్రసారంలో వీక్షిద్దాం.   
Last Updated : June 21, 2025 at 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.